Allu Arha: ‘శాకుంత‌లం’ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ..ఫోటోలు వైరల్..!

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భ‌ర‌తుడి పాత్రలో అర్హ కనిపించబోతుంది.ఈ చిత్రానికి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసింది అర్హ. ఇటీవల జరిగిన ‘శాకుంతలం’ షెడ్యూల్లో అల్లు అర్హ‌ పై కీలక స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, అల్లు అయాన్… సెట్స్ కు వెళ్లి సందడి చేశారు.

దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తన కూతురు నటించడం చూసి బన్నీ తెగ మురిసిపోయాడు కూడా..! అయితే ఇప్పుడు షూటింగ్ పూర్తి కావ‌డంతో చిత్ర యూనిట్ సభ్యులకు అర్హ గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది. దాంతో గుణ శేఖర్ అలాగే నీలిమ గుణ లు ఓ కేక్ తెప్పించి అర్హతో కట్ చేయించారు.అంతేకాకుండా ఈ చిన్నారికి ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు.

ఈ మూవీలో నటిస్తున్నందుకు గాను అర్హకి పారితోషికం వంటిది ఏమీ తీసుకోవడం లేదు అని తెలుస్తుంది. గుణశేఖర్ పారితోషికం ఇస్తాను అని చెప్పినా.. అల్లు అర్జున్ వద్దన్నాడని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిన్న సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus