‘అంజలి’ కవర్ సాంగ్ లో అల్లు అర్హ!

  • November 21, 2020 / 12:13 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బన్నీ తన కూతురికి స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ అందించాడు. 90లలో వచ్చిన ‘అంజలి’ సినిమాలో ‘అంజలి అంజలి అంజలి’ అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటలో బేబీ షామిలి తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఈ పాట కవర్ సాంగ్ లో అల్లు అర్హ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మురిపిస్తోంది.

ఈ కవర్ సాంగ్ ని తన కూతురు పుట్టినరోజు కానుకగా బన్నీ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అల్లు వారసురాలు అర్హ ఈ కవర్ సాంగ్ లో ఎంతో తేలికగా నటించింది. తన సహజ నటన, ఎమోషన్స్ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. ఒరిజినల్ సాంగ్ లో బేబీ షామిలి అన్నయ్యగా తరుణ్ కనిపించాడు. ఈ కవర్ సాంగ్ లో తరుణ్ ప్లేస్ లో అల్లు అయాన్ కనిపించాడు. అలానే మధ్యలో అల్లు అరవింద్, పాట చివర్లో అల్లు అర్జున్ కనిపించి ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేశారు.

పాటలో అల్లు అర్హ చిన్న చిన్న ఎమోషన్స్ ని కూడా అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు. తన తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్న అర్హ తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది.


మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus