Allu Arjun, Sukumar: ‘ఆర్య’కి 20 ఏళ్లు… ఈ సారి షాకింగ్‌ న్యూస్‌ వింటామా?

‘ఆర్య’ (Aarya)  … ఓ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. ఈ మూడ్‌తోనే ఈ సినిమాను సుమారు 20 ఏళ్ల క్రితం రిలీజ్‌ చేశారు. ఏదో సినిమా వస్తోంది, అల్లు అరవింద్‌ (Allu Aravind) కొడుకు నటించాడు, సుకుమార్‌ (Sukumar) అనే కొత్త దర్శకుడు అనే మాటలతో ఈ సినిమాకు పెద్ద హైప్‌ కూడా లేదు. అయితే 2004లో వచ్చిన ఈ సినిమా ‘వన్‌ సైడ్‌ లవ్‌’ అంటూ ఆర్య చేసిన అల్లరి, ఆ తర్వాత ఎమోషన్స్‌తో పిండేసిన విధానానికి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చేశారు. ఇక అక్కడికి ఐదేళ్లకు రెండో ‘ఆర్య’ వచ్చాడు. ఈసారి ప్లాట్‌ మారిపోయింది. అలాగే రిజల్ట్‌ కూడా మారిపోయింది. ఇప్పుడు ‘ఆర్య’ గురించి ఎందుకు 20 ఏళ్లు అవ్వడానికి ఇంకో నెల ఉంది కదా అంటారా? అవును మీరన్నది నిజమే… అయితే ఈ ముచ్చట ఇప్పుడు డిస్కషన్‌లోకి రావడానికి కారణం నిర్మాత దిల్‌ రాజు(Dil Raju) . ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఆర్య’ ప్రస్తావన తెచ్చారు. సినిమా వచ్చి మే 7కి 20 ఏళ్లు అవుతోంది కాబట్టి టీమ్‌ అంతా ఓసారి కలుద్దాం అనుకుంటున్నాం.

‘ఆర్య’ రీయూనియన్‌ ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. దీంతో రీయూనియన్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది. రెండో ‘ఆర్య’(Arya2) ఫలితం తేడా కొట్టినా బన్ని నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మూడో ‘ఆర్య’ ఏమన్నా వస్తాడా? తొలి రెండు సినిమాలకు భిన్నంగా బన్నీని (Allu Arjun) ఆ సినిమాలో సుకుమార్‌ ఏమన్నా ప్రత్యేకంగా చూపిస్తారా అనేది ఇప్పుడు చర్చ.

‘పుష్ప’ (Pushpa) సినిమాలతో వరుసగా బన్నీతోనే సినిమాలు చేస్తున్నారు సుకుమార్‌. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) సినిమా ఉంటుందని ఇటీవల ప్రకటించారు కూడా. ఆ లెక్కన ఆ సినిమా అయ్యాక మళ్లీ బన్నీ – సుకుమార్‌ కాంబో ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్‌సైడ్‌ లవ్‌, హిడెన్‌ లవ్‌ చూపించిన ‘ఆర్య’ ఈసారి ఏం చూపిస్తాడో మరి. ఎందుకంటే ఇలాంటి విచిత్ర ప్రేమలు చూపించడం మన లెక్కల మాస్టారుకు మా చెడ్డ ఇష్టం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus