పాలకొల్లు శివాలయం లో కల్యాణ మండపం కట్టిస్తా.. 10లక్షలు ఇస్తున్నా : అల్లు అర్జున్

ఈ సంక్రాంతి కి తన సొంత ఊరు పాలకొల్లు కి విచ్చేసిన సంగతజ్ తెలిసిందే.. బోగీ రోజు అల్లు అర్జున్ బంధువులు కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు కుటుంబంతో కలిసి వెళ్లారు.. అలాగే సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొనే సందర్భంగా పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం సందర్శిస్తారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో అల్లు అర్జున్ కుటుంబం పాల్గొన్నారు.. అలాగే పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహానికి పూల మాల ఫ్యామిలీ తో కలిసి వేశారు.. ఈ సందర్భం గా అల్లు అర్జున్ మాట్లాడుతూ… మా తాతగారు పాలకొల్లు లో పుట్టారు… మా నాన్నగారు ఇక్కడే పుట్టారు..నేను మద్రాసు లో పుట్టాను.. ఆ తరువాత హైద్రాబాద్ లో పెరిగాను…

అయితే నన్ను మీ ఊరు ఏది అంటే మాత్రం పాలకొల్లు అని మాత్రమే చెప్తాను.. పెళ్లయ్యాక మా ఆవిడ అడిగింది మీ పాలకొల్లు తీసుకెళ్లవా అని.. అలాగే మా అబ్బాయిని అడిగా నీ ఊరు ఏది అని.. దానికి వాడు పాలకొల్లు అని చెప్పాను ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్లలేదు అన్నాడు.. నాకు కూడా చాలా రోజుల నుండి అందరూ హైద్రాబాద్ నుండి ఊర్లు వెళ్తున్నారు.. రోడ్లు కాలి అవుతున్నాయి.. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అని… ఈ సారి మా ఊరు పాలకొల్లు వెళ్ళాలి అనుకుని వచ్చేసా… ఇక్కడికి రావటానికి మెయిన్ కారణం మాత్రం నా ఫామిలీ… నా ఊరు పాలకొల్లు మా తాతయ్య కి నాన్న కొంచెం ఇచ్చింది… నాకు చాలా ఇచ్చింది… అలాంటి నా ఊరుకు ఏమైనా ఇవ్వాలి… కాదు ఇస్తూనే ఉండాలి..

అందుకే ఈ సంక్రాంతి నుండి స్టార్ట్ చేస్తున్నా… పెద్ద గుడిలో కల్యాణ మండపం కట్టిస్తా… దానికి 10 లక్షలు డోనేషన్ ఇస్తున్నా… ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకునే ప్రయత్నం చేస్తా… అలానే ఈ ఏర్పాట్లు అన్ని చేసిన నా మిత్రుడు ప్రొడ్యూసర్అ బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus