స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా నటించిన చిత్రం “దువ్వాడ జగన్నాథమ్”. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. బన్నీ ఫ్యాన్స్ సినిమా బాగుందని చెబుతుంటే.. సినీ విశ్లేషకులు మాత్రం సినిమాలో ఆకర్షించే అంశాలు ఏమీ లేవని రివ్యూలు రాసారు. ఈ నెగెటివ్ రివ్యూలపై అల్లు అర్జున్ స్పందించారు. డీజే చిత్ర బృందం సోమవారం సాయంత్రం నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నెగెటివ్ రివ్యూలను తాను ఎంత మాత్రం పట్టించుకోనని చెప్పారు. తన పాజిటివ్ యాటిట్యూడ్ తో నెగెటివ్ రివ్యూస్ ను క్రాస్ చేస్తానన్నారు.
ప్రేక్షకులు చాలా మంచి వాళ్లనీ .. ఆ విషయాన్ని ఈ సినిమా మరో మారు నిరూపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీజే గురించి నెగెటివ్ రివ్యూస్ రాసిన వాళ్లంతా, పెరుగుతోన్న వసూళ్లను చూసైనా అభిప్రాయాన్ని మార్చుకోవాలని సూచించారు. “దువ్వాడ జగన్నాథమ్” సినిమా ప్రచార సమయంలో రిపోర్టర్లకు ఆంక్షలు విధించి వార్తల్లో నిలిచిన అల్లు అర్జున్, పబ్లిక్ ఫంక్షన్లో నెగిటివ్ రివ్యూలు రాసిన వాళ్లపై విరుచుకుపడి శత్రువులను పెంచుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.