Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్లో కలుద్దామన్న హీరోయిన్.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?
- November 17, 2026 / 10:00 AM ISTByFilmy Focus Desk
కొన్ని నెలలుగా సెట్స్ మీద ఓ సినిమా ఉన్న హీరో సరసన నటించే అవకాశం వచ్చింది అని ఎవరైనా హీరోయిన్ గురించి రూమర్ వస్తే.. ఆటోమేటిగ్గా నెక్స్ట్ సినిమాలోనే అనుకుంటారు. షూటింగ్ జరుగుతున్న సినిమా అని అయితే అనుకోరు. కానీ అల్లు అర్జున్ విషయంలో అలా జరగడం లేదు. ఎందుకంటే సెట్స్ మీద ఉన్న సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అయితే లేదు. అందుకే ఈ డౌట్. ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. ఇంకెవరు లేటెస్ట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్లో ఆషికా రంగనాథ్.
Allu Arjun – Ashika
ఆదివారం మధ్యాహ్నం ఆషిక రంగనాథ్ సోషల్ మీడియాలో ఖాతాలో రెండు ఫొటోలు వచ్చాయి. అందులో ఆమెతో ఉన్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ ఫొటోల కింద రైటప్ సంగతి చూస్తే.. ‘‘మీతో కలసి పనిచేయడం చాలా బాగుంది అల్లు అర్జున్ మళ్ళీ కలుద్దాం. అయితే ఈసారి ఒక సినిమా సెట్ లో కలుద్దామని ఆశిస్తున్నాను’’ అని ఉంది. అంటే ఇద్దరూ కలసి పని చేశారని అర్థం. అయితే అది సినిమా కాదు.
దీంతో ఇద్దరూ ఓ యాడ్‌లో నటించారని, త్వరలోనే సినిమా ఛాన్స్ వస్తుందని ఆషికా ఆశిస్తోందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ యాడ్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే.. ఇద్దరూ కలసి ‘ఆహా’ యాడ్‌లో నటించారు అని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆహా ప్రచారం అంతగా లేదు. ఇప్పుడు మరోసారి రీస్టార్ట్ చేస్తున్నారట. ఈసారి ‘ఆహా 3.0’ అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకొస్తారట. అందులో భాగంగానే ఆషికా ఓ యాడ్‌లో నటించింది అని చెబుతున్నారు.
ఇక డౌట్ విషయానికొస్తే.. ఒకవేళ ఆషికా ఆశించినట్ల బన్నీతో సినిమా చేస్తే అది ‘రాకా’ అవుతుందా? లేక ‘గ్యాంగ్‌స్టర్’ అవుతుందా అనేది చూడాలి. ‘రాకా’లో ఇంకా హీరోయిన్లతో అవకాశముందని ఓ టాక్. ఇక లోకేశ్ కనగరాజ్ తన సినిమా కాస్టింగ్ పనులు వేగవంతం చేశారట. దానికే ‘గ్యాంగ్‌స్టర్’ అనే పేరు పరిశీలిస్తున్నారట.














