స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక హీరోగానే కాదు నిర్మాతగానూ ఆలోచిస్తుంటారు. స్టార్ డైరక్టర్స్ తో సినిమాలు చేసి నష్టపోవడం కంటే.. కొత్త డైరక్టర్స్ తో లాభాలను అందించాలని చూస్తుంటారు. కొన్ని అనుభవాల కారణంగా యువ డైరక్టర్లతోనే నడవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే దువ్వాడ జగన్నాథం తర్వాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” సినిమా చేస్తున్నారు. అతనికి డైరక్టర్ గా అవకాశమిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 4 న విడుదల కానుంది.
దీని తర్వాత కూడా యువ డైరక్టర్స్ డైరెక్షన్లోనే నటించాలని భావిస్తున్నారు. క్షణం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో దర్శకుడు రవికాంత్ పెరుపు హిట్ అందుకున్నారు. అతను ప్రస్తుతం దగ్గుబాటి రానా కోసం ఓ లవ్ స్టోరీ ని సిద్ధంచేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ బృందానికి రవికాంత్ ఓ స్టోరీ చెప్పినట్లు తెలిసింది. ఆ స్టోరీ బాగుండడంతో అతనితో సినిమా చేయడానికి బన్నీ టీమ్ ఓకే చెప్పినట్లు సమాచారం. రవికాంత్ ఈ కథకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. తొందరగా పూర్తి చేసి అల్లు అర్జున్ కి వినిపించనున్నారు. అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. ఇతనితో పాటు “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ వి.ఐ ఆనంద్ కి కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.