దువ్వాడ జగన్నాథం సినిమా ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ మార్చారు. కొత్త దర్శకులైతే కష్టపడి పనిచేస్తారని.. పూర్తి ఎఫెక్ట్ పెడతారని.. వారితో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగానే రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య” సినిమా చేసారు. అపజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో పూర్తిగా అప్సెట్ అయిన బన్నీ పాత విధానంలోనే నడుస్తున్నారు. స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు.
త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోను, కొరటాల చిరుకు కథ రెడీ చేయడంలో, సుకుమార్ మహేష్ బాబుకి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. సో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించాలని భావిస్తున్నారు. ఇదివరకే అతని కథకి ఓకే చెప్పిన బన్నీ రీసెంట్ గా స్క్రిప్ట్ విన్నారంట. ఫస్టాఫ్ బాగానే వున్నా సెకండాఫ్ బన్నీకి నచ్చలేదని సమాచారం. ఈ విషయాన్నీ డైరక్టర్ కి డైరక్ట్ గా చెప్పడంతో.. బన్నీకి నచ్చేలా మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు. విక్రమ్ కుమార్ కథతో పాటు యువ దర్శకుల కథలు వింటున్నారు కానీ ఎవరికి అల్లు అర్జున్ ఓకే చెబుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.