‘నా పేరు సూర్య’ సినిమా కోసమేనా ఈ లుక్ ?
- July 20, 2017 / 06:55 AM ISTByFilmy Focus
గంగోత్రి నుంచి దువ్వాడ జగన్నాథం వరకు అల్లు అర్జున్ ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుని నిలబెట్టుకునేందుకు కష్టపడు తూనే ఉన్నారు. డీజే తర్వాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా బన్నీ తన చిత్రంతో పరిచయం చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’. ఇది దేశభక్తి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకు జవాన్ స్టైల్లో కటింగ్ చేసుకున్నారు. దానికి కొంత ఫ్యాషన్ జోడించారు.
నిన్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో బన్నీ పాల్గొన్నారు. కొత్త హెయిర్ స్టైల్లో కనిపించాడు. దీంతో ఈ లుక్ “నా పేరు సూర్య” కోసమేనని అభిమానులు సంబర పడుతున్నారు. మరి ఇదే లుక్ తో సినిమాలో కనిపిస్తారా? లేకుంటే మరో స్టైల్ ట్రై చేస్తారా ? అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















