పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , పుష్ప 2 (Pushpa 2) కోసం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. పాట్నా నుంచి చెన్నై వరకు, అన్ని కీలక నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లతో చిత్రానికి బలమైన బజ్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 5న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో, బన్నీ ప్రెజెంటేషన్ స్టైల్ మరో స్థాయిలో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజ్ అనంతరం కూడా 20 రోజుల పాటు ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో అల్లు అర్జున్ బిజీగా ఉంటారని సమాచారం.
అయితే, ఆ తర్వాత బన్నీ పెద్ద బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఆరు నెలల పాటు ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్ లతో అలసిపోయిన బన్నీ, ఈ బ్రేక్ ద్వారా పుష్ప 2 తర్వాత మరో ప్రాజెక్టును ఫ్రెష్‌గా తిరిగి పని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన స్టోరీ వర్క్ పూర్తవుతుందని అంచనా.
పుష్ప-2 తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బన్నీ ఫోకస్ పెట్టారట. ఈ చిత్రానికి సంబంధించిన కథ మైథాలజికల్ హిస్టారికల్ టచ్ తో ఉండబోతుందని తెలుస్తోంది. కొందరు ఇది చెంఘీజ్ ఖాన్ బయోపిక్ అని అంటున్నారు. కానీ అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ స్టోరీ రాశారని, అది అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కథలో డిఫరెంట్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ పాత్రలతో ఈ చిత్రం మరో పాన్ ఇండియా హిట్ అవుతుందనే నమ్మకం బన్నీ టీమ్‌లో ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద, పుష్ప 2 విడుదల అనంతరం అల్లు అర్జున్ కోసం సుదీర్ఘ విశ్రాంతి, ఆ తర్వాత కొత్త సినిమా అనుభవానికి సిద్ధమవుతున్నారు.