Allu Arjun: అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?

అల్లు అర్జున్‌ (Allu Arjun)  అందరి వాడిని నేను అని అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అందరితో మంచిగా ఉందాం అని కూడా అనుకుంటాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడో తేడా కొట్టేసి కొంతమందిని దూరం చేసుకుంటున్నాడు. అయితే అనుకొని జరుగుతుందో లేదో తెలియదు కానీ తన వాళ్లు అనుకున్న వాళ్లు కూడా దూరమవుతున్నారు. అయితే అలా దూరమవుతున్న విషయంలో ఆయన తప్పు లేకపోవడం గమనార్హం. కావాలంటే మీరే చూడండి బన్నీ అంటే బాగా అభిమానించే ఇద్దరు సినిమా జనాలు ఇప్పుడు ఆయన నుండి దూరమవుతున్నట్లు అర్థమవుతోంది.

Allu Arjun

ఒకరు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master)  అయితే, మరొకరు మ్యూజిక్‌ డైరక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad). ఈ ఇద్దరూ అల్లు అర్జున్‌కు ఎంత క్లోజో మీకు తెలిసే ఉంటుంది. డీఎస్పీ కదిపితే చాలు బన్నీ గురించి చెబుతూనే ఉంటాడు. ఇక జానీ మాస్టర్‌కు అయితే బన్నీ చాలా ఛాన్స్‌లు ఇచ్చాడు. ఇప్పుడు స్టార్‌ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరూ బన్నీకి దూరమవుతున్నారు.

జానీ మాస్టర్‌ విషయంలో తమకు, తమ హీరోకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ క్లారిటీగా చెప్పినా.. మొత్తం గొడవ అంతా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)సెట్‌లోనే జరిగింది అని టాక్‌. ఆ సమయంలో బన్నీ ఓవైపు స్టాండ్‌ తీసుకోవడంతోనే ఆ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ బయటకు వచ్చి విషయం చెప్పారు అని అంటున్నారు. ఇక ‘పుష్ప 2’ సంగీతం విషయంలో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో డీఎస్పీ స్థానంలో ఇతర సంగీత దర్శకులు వచ్చారు అని మొన్న చెన్నై ఈవెంట్‌లో అర్థమైపోయింది.

ఈ లెక్కన దేవి కూడా బన్నీ సినిమాలకు దూరమయ్యాడు అని చెప్పాలి. తర్వాత సినిమా చేస్తాడు కదా అంటే.. ఆ సినిమా త్రివిక్రమ్‌తో ఉంది. ఆయన సినిమాలో దేవి కష్టమే. ఆ లెక్కన బన్నీకి జానీ మాస్టర్‌, డీఎస్పీ ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లే అని తెలుస్తోంది. అయితే ఆయన ఆఫ్‌ స్క్రీన్‌ స్నేహం మాత్రం అలానే ఉంటుంది అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus