Nikhil: నిఖిల్‌ సైలెంట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎందులో అంటే?

ఎప్పుడు మొదలైందబ్బా ఈ సినిమా, ఎప్పుడు షూటింగ్‌ చేశారు, హీరో లుక్‌ చూస్తుంటే ఇప్పటి సినిమాలా లేదే.. అనే అనుమానాలు ఉన్న సమయంలోనే థియేటర్లలో వచ్చేసి, అంతే వేగంగా మళ్లీ ఇంటికి వెళ్లిపోయింది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo). నిఖిల్‌ (Nikhil) హీరోగా అతని స్నేహితుడు సుధీర్‌ వర్మ (Sudheer Varma) తెరకెక్కించిన చిత్రమిది. థియేటర్లలో ఈ సినిమా ఫలితం మనకు తెలుసు. ఇప్పుడు ఓటీటీలో నిరూపించుకోవడానికి వచ్చేసింది. సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అదే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Nikhil

ఇటీవలే థియేటర్‌లోకి వచ్చి ఆశించిన ఫలితం అందుకోక సైలెంట్‌ అయిపోయిన ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రైమ్‌ వీడియో ఓ పోస్ట్‌ పెట్టింది. రిషి, తారల ప్రేమకథను చూసేయండి అని గొప్పగా రాసుకొచ్చింది కూడా. ఇక ఈ సినిమా కథ గురించి చూస్తే.. రేసర్ కావాలని ఆశపడే రిషి (నిఖిల్‌).. తార (రుక్మిణి వసంత్‌) (Rukmini Vasanth)  అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రేమ ఫలించదు.

దాంతో రేసర్ కావాలన్న తన లక్ష్యం కోసం లండన్ వెళ్లిపోతాడు. అక్కడ రేసింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూనే, పార్ట్ టైమ్‌ జాబ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో తులసి (దివ్యాంశ కౌశిక్‌) (Divyansha Kaushik).. రిషికి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుందామని దేవాలయానికి వెళ్తారు. అయితే అనూహ్యంగా తులసి మాయమవుతుంది. దీంతో మరోసారి రిషి జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. తులసి ఎవరు? ఎక్కడికి వెళ్లింది? అంటూ రిషికి వెతకడం స్టార్ట్‌చేస్తే..

చాలా విషయాలు తెలుస్తాయి. ఈ లోపు తార లండన్‌ వస్తుంది. ఆమె ఎందుకు వచ్చింది అనేది కథలో కీలకం. కాస్త పాత టైపు కథలా కనిపించడం, గ్రిప్పింగ్‌గా లేకపోవడం థియేటర్లలో సినిమాకు ఆశించిన విజయం రాలేదు. మరిప్పుడు ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఓటీటీలో మంచి ఫలితం అందుకోవడం మనం గతంలో చూశాం.

మహేష్ బాబుపై సల్మాన్ ఖాన్ ఎలివేషన్స్.. ఇది చూశారా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus