Pushpa Release Date: సంక్రాంతి పోటీకి దూరంగా బన్నీ!

  • August 3, 2021 / 01:03 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటిస్తుండగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ సమస్య ఎదురవుతోంది. బన్నీ గత సినిమా అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ సాధించగా ఇప్పటికే 2022 సంక్రాంతికి పలు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ కావడంతో బన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టే అని చెప్పాలి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ జనవరి 12వ తేదీన రిలీజ్ కానుండగా సర్కారు వారి పాట జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ గురించి ప్రకటన చేయకపోతే ఇబ్బందులు తప్పవని భావించి స్టార్ హీరోలు వేగంగా తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. స్టార్ హీరో బన్నీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరగా ప్రకటించాలని ఒత్తిడి తీసుకురాగా క్రిస్ మస్ కు ఈ సినిమా రిలీజవుతున్నట్టు ప్రకటన వెలువడింది.

ఆచార్య సినిమాను ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడితే ఆ తేదీకి రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. పుష్ప మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్నట్టు ప్రకటన రావడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మరి ఆ తేదీకి పుష్పకు పోటీగా మరో సినిమా రిలీజవుతుందేమో చూడాల్సి ఉంది.. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తుండగా అనసూయ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus