టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఆ సినిమాకు మించిన విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమాకు బన్నీ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా
ప్రస్తుతం ఆ పారితోషికం మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా 125 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని బోగట్టా. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సుకుమార్ పారితోషికం 75 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ ఎక్కువమొత్తం పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ హైయెస్ట్ రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయలు కాగా బన్నీ పారితోషికం విషయంలో ప్రభాస్ ను బీట్ చేశారు.
బన్నీ పుష్ప ది రూల్ రిజల్ట్ విషయంలో కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది. బన్నీ మరెన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ విషయంలో చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మూడు సినిమాలు రాగా ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదనే సంగతి తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.