Allu Arjun: ‘కె.జి.ఎఫ్ 2 ‘ పై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!

Advertisement

గత వారం అంటే ఏప్రిల్ 14న విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్ లో ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సూపర్, వండర్ అంటూ ట్వీట్లు వేశారు. తాజాగా ఈ చిత్రం చూసిన ఐకాన్ స్టార్ అలాగే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ తన స్పందనని తెలియజేసాడు.

Click Here To Watch NOW

‘ ‘కె.జి.ఎఫ్ 2’ టీంకి బిగ్ కంగ్రాట్యులేషన్స్. ఈ మూవీలో యష్ నటనలో ఇంటెన్సిటీ, స్వాగ్ అద్భుతంగా ఉన్నాయి. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ల నటన కూడా మరువలేనిది. తమ నటనతో ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ విజువల్స్ కూడా సూపర్. అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ గౌరవమర్యాదలు తెలుపుకుంటున్నాను.

దర్శకుడు ప్రశాంత్ నీల్ గారి విజన్ కు కన్విక్షన్ కు హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినందుకు గర్వపడుతూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నాడు అల్లు అర్జున్.ఇక అల్లు అర్జున్ ట్వీట్ పై ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్పందిస్తూ… ‘థాంక్యూ సర్’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్… సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. పార్ట్1 సూపర్ హిట్ అవ్వడంతో పాటు హిందీలో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ కలెక్షన్లను అధిగమించింది.

ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ క్రియేట్ చేసిన రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని అల్లు అర్జున్ అభిమానులు ఆశిస్తున్నారు. ‘పుష్ప’ రిలీజ్ కు ముందు కూడా సుకుమార్ శిష్యుడు ‘ఉప్పెన’ దర్శకుడు అయిన బుచ్చిబాబు ‘పుష్ప’ 10 కె.జి.ఎఫ్ లతో సమానం అని చెప్పాడు. హిందీ వెర్షన్ పరంగా అయితే అతని మాట నిజమైంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news