Allu Arjun: బన్నీకి డైరెక్టర్ కష్టాలు!

  • February 22, 2023 / 10:08 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న పార్ట్ 2లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్లే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేసి.. పెర్ఫెక్ట్ అనుకున్న తరువాతే షూటింగ్ ను మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ‘పుష్ప ది రైజ్’ సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి.

అందుకే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ‘పుష్ప2’ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో అల్లు అర్జున్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. తన రేంజ్ కి సరిపడే దర్శకులు అందరూ బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా ఫిక్స్ చేయబోతున్నారు. అలానే రామ్ చరణ్ కూడా లైన్ లో ఉన్నారు.

కాబట్టి ఇప్పట్లో ఆయన ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. దర్శకుడు రాజమౌళి గురించి ఎదురుచూడడమే తప్ప మరో మూడు నాలుగేళ్ల పాటు ఆయన దొరికే అవకాశమే లేదు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. దీని తరువాత రణవీర్ సింగ్ సినిమాను పూర్తి చేయాల్సివుంది. సందీప్ రెడ్డి వంగ ‘యానిమల్’ తరువాత మరో రెండేళ్లు ‘స్పిరిట్’తో బిజీ కానున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’తో భారీ విజయం అందుకున్న బాబీతో సినిమా చేద్దామంటే రిస్క్ ఎక్కువ అని ఆలోచిస్తున్నారు.

మురుగదాస్, లింగుస్వామి వంటి దర్శకులు ఫామ్ లో లేరు. బోయపాటి కూడా బిజీగానే ఉన్నారు. వంశీ పైడిపల్లికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. దీంతో బన్నీ నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ దొరుకుతారా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి బన్నీ ఎవరిని లాక్ చేస్తారో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus