Ghani Movie: వరుణ్ తేజ్ జాతకాన్ని ఆ హీరో మారుస్తారా?

మరో 5 రోజుల్లో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ థియేటర్లలో విడుదల కానుంది. వరుణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన గని బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉగాది పండుగ కానుకగా జరిగిన గని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు.

Click Here To Watch NOW

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైతే సినిమా హిట్ అని వరుణ్ అభిమానులు చెబుతున్నారు. బన్నీ అఖండ సినిమా ఈవెంట్ కు హజరు కాగా ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగగా గని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వైజాగ్ లో జరిగింది.

వరుణ్ తేజ్ గని సినిమాకు బన్నీ సెంటిమెంట్ తో పాటు వైజాగ్ సెంటిమెంట్ కూడా ప్లస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ విషయంలో సందేహం అవసరం లేదని వరుణ్ అభిమానులు చెబుతున్నారు. ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాల విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. వరుణ్ నటించిన ఎఫ్3 వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. ఆరు వారాల గ్యాప్ లో వరుణ్ తేజ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

గని ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో వరుణ్ తేజ్ అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే వరుణ్ తేజ్ ఓటు వేస్తున్నారు. వరుస విజయాలతో వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది.

విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న వరుణ్ తేజ్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు. గని సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus