Allu Arjun, Klin Kaara: క్లీంకారపై ప్రేమ, ఆప్యాయత చూపించిన బన్నీ.. ఆ బహుమతితో?

చరణ్ ఉపాసన కూతురు క్లీంకార కొణిదెలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రతి విషయం వైరల్ అవుతోంది. క్లీంకార చాలా క్యూట్ గా ఉందని సాయితేజ్, మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా అధికారికంగా క్లీంకార ఫోటోలను రిలీజ్ చేసే క్షణాల కోసం మెగా అభిమానులతో పాటు సాధారణ అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే క్లీంకారకు ఖరీదైన కానుకలు బహుమతులుగా అందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా క్లీంకార బారశాల వేడుక గ్రాండ్ గా జరగగా ఈ వేడుకలో బన్నీ బంగారు పలకను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

క్లీంకార పేరు, పుట్టిన వివరాలు ఉండేలా ఆ బంగారు పలకను తయారు చేయించినట్టు సమాచారం. ఈ బంగారు పలక కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లక్షల్లో ఖర్చు చేశారని తెలుస్తోంది. బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను చూసి చరణ్ ఉపాసన ఎంతో సంతోషించారని సమాచారం. పేరు, వివరాలను పొందుపరిచి బంగారు పలకను ఇచ్చిన బన్నీ (Allu Arjun) ఐడియా సింప్లీ సూపర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం క్లీంకార కోసం బంగారు డాలర్స్ ను అద్భుతమైన డిజైన్ లో తయారు చేయించి పంపారని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ క్లీంకారను మెగా ప్రిన్సెస్ అని సంబోధిస్తున్నారు. క్లీంకార జాతకం అద్భుతంగా ఉందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీకి మరింత కలిసొస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని భారీ విజయాలను అందుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. బన్నీ క్లీంకారపై ప్రేమ, ఆప్యాయత చూపించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్లీంకార కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. చరణ్ బన్నీ కాంబోలో భారీ మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus