Game Changer: మెగా హీరోలంతా మరోసారి ఒకే స్టేజ్ పై కనిపించనున్నారా!

సంక్రాంతికి రిలీజవుతున్న “గేమ్ ఛేంజర్” (Game Changer) పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మొదటి ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించిన చిత్రబృందం, నిన్న విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ (Ram Charan) మాస్ కట్ అవుట్ ను లాంచ్ చేసి చరిత్ర సృష్టించింది. జనవరి 10న విడుదల కాబోయే ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కు చిరంజీవి (Chiranjeevi)  , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ముఖ్య అతిధులుగా హాజరవ్వనున్నారని సమాచారం.

Game Changer

అయితే.. ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే.. ఇదే ఈవెంట్ కు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా హాజరవ్వనున్నాడట. మెగా బ్రదర్స్ మాత్రమే కాక మెగా ఫ్యామిలీ హీరోలందరూ కలిసి మళ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని వినికిడి. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ (Gabbar Singh)  ఆడియో రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో  (Naga Babu) పాటు అల్లు అర్జున్ కనిపించాడు. ఆ తర్వాత పలుమార్లు చిరంజీవి లేదా రామ్ చరణ్ లతో బన్నీ కనిపించాడు కానీ పవన్ పక్కన మాత్రం తారసపడలేదు.

ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ అంశాల కారణంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్రేమ్ లో అల్లు అర్జున్ మరోమారు కనిపించనుండడం చర్చనీయాంశం కానుంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ.. నిజంగా జరిగితే ఈ మెగా వర్సెస్ అల్లు అనే గోలకి కచ్చితంగా తెరపడడమే కాక “గేమ్ ఛేంజర్” సినిమాకి మంచి మైలేజ్ ఇస్తుంది.

ఇకపోతే.. శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇప్పటివరకు రామ్ చరణ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని అనుకుంటూ వచ్చారు జనాలు. కట్ చేస్తే.. మూడో షేడ్ కూడా ఉన్నట్లు దిల్ రాజు నిన్న ప్రకటించడం మంచి ఆసక్తి నెలకొల్పింది. కియారా అద్వానీ  (Kiara Advani)  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి (Anjali)  కీలకపాత్ర పోషించనుంది.

సుకుమార్.. అలా జరక్కపోయి ఉంటే సినిమాలకు దూరమే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus