ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!

2024 లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు చాలా తక్కువ. అయితే ఈ ఏడాది 4 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి బడ్జెట్లు ఎంత.2024 లో వచ్చిన సినిమాల్లో కాస్ట్లీయెస్ట్ అంటే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల లిస్ట్..ను ఓ లుక్కేద్దాం రండి :

Tollywood Movies

1) కల్కి 2898 AD (Kalki 2898 AD) :

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) తన కూతుర్లు ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt) ..లతో కలిసి ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుని.. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

2) పుష్ప 2(ది రూల్) (Pushpa 2 The Rule) :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ‘పుష్ప’ (ది రైజ్) కి (Pushpa) కొనసాగింపుగా రూపొందిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు కలిసి రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1700 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

3) దేవర (పార్ట్ 1)  (Devara):

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందింది ఈ చిత్రం.’యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni)… కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram) కలిసి రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) గుంటూరు కారం (Guntur Kaaram) :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.172 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) లక్కీ భాస్కర్ (Lucky Baskhar) :

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) :

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7) డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) :

రామ్ పోతినేని (Ram) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఇది. ‘పూరీ కనెక్ట్స్ ‘ బ్యానర్ పై ఛార్మీ (Charmy Kaur) , పూరీ జగన్నాథ్..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.18 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.

8) మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) :

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘రైడ్’ అనే హిందీ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.16 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.

9) సైందవ్ (Saindhav) :

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ఇది. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి (Venkat Boyanapalli,) ఈ చిత్రాన్ని రూ.55 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.22 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

10) ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) : 

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పరశురామ్(బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.24 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.

11) హనుమాన్ (Hanuman) :

తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus