స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun) ప్రస్తుతం తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాడు. ‘పుష్ప ది రైజ్’(Pushpa)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, ఇప్పుడు ఆ హైప్ కొనసాగిస్తూ, ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప ది రూల్’ (Pushpa 2) తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని టీమ్ షెడ్యూల్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వంటి దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టుకున్న అల్లు అర్జున్, తాజా సమాచారం ప్రకారం మరో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో (Nelson Dilip Kumar) సినిమా చేసే అవకాశముందట.
‘జైలర్’తో (Jailer) భారీ హిట్ అందుకున్న నెల్సన్, అల్లు అర్జున్ కోసం ఓ కథను సిద్ధం చేసి వినిపించాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీ ఆ లైన్‌కి ఇంప్రెస్ అవడంతో, నెల్సన్‌కు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని సూచించాడట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ చిత్రానికి ఫోకస్ చేసినట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే బన్నీతో సినిమా మొదలవుతుందని అంటున్నారు.
ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే దర్శకుడు ఇంకా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేదట. పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చితేనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక దర్శకుడు కూడా హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కథ సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.
ఈ లోపు అతను జైలర్ 2 తో మరో హిట్టు కొడితే బన్నీ ఈజీగా నమ్మే అవకాశం ఉంటుంది. తమిళంలో ఇప్పటికే బన్నీకి మంచి మార్కెట్ ఉండటంతో, ఈ చిత్రంతో ఆయన కోలీవుడ్‌లో మరింత స్థిరపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బన్నీ – నెల్సన్ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.