ఇదేం టైటిల్ బన్నీ.. అప్పుడే ట్రోలింగ్ మొదలు..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంతో వీరిద్దరికి హ్యాట్రిక్ కొడతారని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రం మొదలు పెట్టి చాలా రోజులవుతున్నా.. ఈ చిత్రం టైటిల్ ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.

ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి ‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవేమీ ఫైనల్ కాదని… ఈ చిత్రానికి ‘అలా వైకుంఠపురంలో’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని సమాచారం. టైటిల్ అధికారికంగా ఆగష్టు 15 న విడుదల చేయడానికి.. రెండు రోజుల ముందే ఇలా నెట్లో లీకవ్వడం సంచలనంగా మారింది. ఈ టైటిల్ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదంట. దీంతో ‘ఇదేం టైటిల్ బన్నీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఎంతవరకూ నిజముందో ఆగష్టు 15న తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus