అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయనున్న నాని
- March 25, 2017 / 01:41 PM ISTByFilmy Focus
ఈ టైటిల్ చదివి అల్లు అర్జున్ సినిమాలో నాని డైరక్టర్ గా నటిస్తున్నారేమోనని డిసైడ్ అయిపోకండి. నిజంగానే బన్నీని నాని డైరక్ట్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో నాని “నిన్నుకోరి” చిత్రాన్ని చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వైజాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇలా హీరోగా బిజీగా ఉన్న నాని ఫై ఈ రూమర్ రావడానికి బలమైన కారణం ఉంది. నాని అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ ని కలిసి సూపర్ కథ చెప్పారంట.
అప్పుడే కలిసి సినిమా చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ హీరోలుగా బిజీ కావడంతో ఆ ప్రాజక్ట్ రూపు దాల్చుకోలేదు. కానీ అప్పటి నుంచి ఇద్దరూ కలిసినప్పుడల్లా ఆ కథపై డిస్కషన్ చేసుకునే వారు. తాజాగా ఓ ఈవెంట్ లో కలిసిన వీరిద్దరూ ఆ ప్రాజక్ట్ ని మొదలు పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారంట. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















