Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను – ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను – ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

  • May 7, 2018 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను – ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈనెల 4వ తేదీన విడుదలైన నా పేరు సూర్య చిత్రంలో సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియన్ ఆర్మీ ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని సైనికులతో కలిసి అల్లు అర్జున్ వీక్షించారు. ఈ చిత్రం గురించి విని సూర్య పాత్ర చేసిన అల్లు అర్జున్ ని భార‌త సైనిక కుటుంబాలు క‌లిసి రోజ్ ఫ్ల‌వ‌ర్ తో అభినందించారు.allu-arjun-watched-naa-peru-surya-movie-with-army-people2

ఇలాంటి చిత్రాలు తమలో మరింత స్ఫూర్తిని, రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తాయని , ఈ చిత్రంలో రియ‌ల్ స‌న్నివేశాలు న‌టుల‌తో చాలా బాగా ఆక‌ట్టుకునేలా చిత్రీక‌రించార‌ని, మా డిసిప్లైన్ క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించిన ద‌ర్శ‌కుడికి మా అభినంద‌న‌లు, ఆ పాత్ర‌లో బోర్డ‌ల్ లో డ్యూటి చెయ్యాలి అను ప‌రిత‌పించేలా యంగ్ బ్ల‌డ్ ఎలా వుంటుందో అల్లు అర్జున్ జీవించారు. మా అంద‌రి నినాదాన్ని కేర‌క్ట‌ర్ వ‌దిలేయ‌డ‌మంటే ప్రాణాలు వ‌దిలేయ‌డ‌మే.. చావు రాక ముందే చ‌చ్చిపోవ‌డం అన్నామాట‌.. ఈ డైలాగ్ లో చూపించిన ఈ చిత్ర యూనిట్ కి మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు అని అధికారులు చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా…..allu-arjun-watched-naa-peru-surya-movie-with-army-people4

మేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈ ప్రిమియర్ షోను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ కు చాలా చాలా థాంక్స్. ఎందుకంటే సోల్జర్స్ కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. కామన్ మ్యాన్ కి తెలియని చాలా విషయాల్ని ఇందులో టచ్ చేశారు. ఈ సినిమా లో ప‌బ్ సీన్ లో వ‌చ్చే సీన్ ఇండియా అంతా ఒక్కటే అని చూపించిన విధానం బాగుంది. అంద‌రికి అర్ద‌మ‌వ్వాలి. భార‌త‌దేశం నాది అనుకున్న ప్ర‌తిఓక్క‌రూ ఈ చిత్రాన్ని చూడాలి. బోర్డ‌ర్ లో ఓ సైనికుడు ఎంత ఇష్ట‌ప‌డి 125 కోట్ల మంది ప్ర‌జ‌ల్ని కాపాడుతాడో సామాన్య ప్ర‌జ‌ల‌కి తెలియాలి.. ఆర్మి అంటే దేశానిక గౌర‌వం అని తెలియాలి.. ఈ విష‌యాన్ని అందిరికి తెలిసేలా పాత్ర‌లో జీవించిన అల్లు అర్జున్ ని మా ఆర్మి కి వెల్‌కం చెబుతున్నాం.. గతంలో మమ్మూట్టి, స‌చిన్ టెండూల్క‌ర్‌, మహెంద్ర‌సింగ్ ధోని లాంటి వారు కూడా దేశ సేవ‌లో భాగ‌స్వాముల‌య్యారు.. ఇలాంటి చిత్రంలో నటించిన అల్లు అర్జున్ కి హాట్సాఫ్.allu-arjun-watched-naa-peru-surya-movie-with-army-people

అల్లు అర్జున్ మాట్లాడుతూ… నా ఇండియన్స్ అందరికి నమస్కారం. నా పేరు అల్లు అర్జున్ నా ఇల్లు ఇండియా.. ఈ చిత్రాన్ని నిజమైన సైన్యాధికారుల మధ్య, నిజమైన ఆర్మీ క్వార్టర్లలో చిత్రీకరించాం. మా తపనకి సహకారం అందించిన భారత సైన్యానికి నా కృతజ్ఞతలు. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను. ఒక సినిమా విజయవంతమైతే పేరొస్తుంది, డబ్బొస్తుంది. వాటిని మించి ఈ సినిమాతో నాకు చాలా గౌరవం లభించింది. నన్ను గర్వపడేలా చేసిన సినిమా ఇదే. చిత్రీకరణ కోసం ఆర్మీ క్వార్టర్లకి వెళ్లినప్పుడే ఆ వాతావరణాన్ని, ఆ జీవితాన్ని చూసి భారత సైన్యంలో చేరాలని దరఖాస్తు చేసుకొన్నా. అధికారులు ఆమోదం తెలపగానే గౌరవ సభ్యుడిగా సైన్యంలో చేరబోతున్నా. సైన్యాధికారుల్ని నేను మొట్ట మొదట కోరుకొన్నది అదే. నా కెరీర్ లో నేను గర్వపడే సినిమా ఇది. థాంక్స్ టూ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి థాంక్స్. జైహింద్ అని అన్నారు.allu-arjun-watched-naa-peru-surya-movie-with-army-people3

ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశి మాట్లాడుతూ.. నేను ఈ చిత్ర క‌థ రాయ‌టానికి భార‌త‌దేశ సైనికులు మాత్ర‌మే.. నా సినిమా ప‌రిదిలో మీ గురించి ఎంత వ‌ర‌కూ చూపించ‌గ‌ల‌నొ అంత‌వ‌ర‌కే చూపించాను. ఈ రోజు ఇంత మంది రియ‌ల్ హీరోస్ మా చిత్రాన్ని చూసి అభినందిస్తుంటే ఈ చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అనే ఆనందం రెట్టింప‌వుతుంది. మ‌రోక్క‌సారి భార‌త‌దేశ సైనికులంద‌రికి మా అభినంద‌న‌లు.. ఇలాంటి మంచి చిత్రాలు ఆద‌రించ‌టం వ‌ల‌న మన సూప‌ర్‌స్టార్స్ నుండి మ‌రిన్ని మంచి చిత్రాలు వ‌స్తాయి. మంచి చిత్రాలు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే వుంటారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని ఇంత‌లా ఆద‌రిస్తున్న భార‌తీయులంద‌రికి మ‌రోక్క‌సారి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. అని అన్నారు.allu-arjun-watched-naa-peru-surya-movie-with-army-people4నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. ముందుగా రియ‌ల్ హీరోస్ మద్య‌లో చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా వుంది. మా చిత్రం విడుద‌లయ్యిన ద‌గ్గ‌ర నుండి ఆంద్ర‌ప్ర‌ధేశ్‌, తెలంగాణా లోనే కాకుండా కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్ర‌ల్లో అద్బుతంగా ముందుకు వెలుతుంది. మ‌న‌కోసం భార‌త స‌రిహ‌ద్దులో అహ‌ర్నిశ‌లు మ‌నకొసం కాపాలా కాసే సైనికుడు జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు మా ద‌ర్శ‌కుడు. ఆ పాత్ర‌లో జీవించాడు మా హీరో అల్లు అర్జున్ వీరి కృషి కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. మా బ్యాన‌ర్ లో గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రం గా నిల‌బ‌డిపోతుంది. అని అన్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anu Emmanuel
  • #Naa peru Surya Movie

Also Read

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

related news

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

trending news

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

43 mins ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

1 hour ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

4 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

5 hours ago

latest news

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

39 mins ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

4 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

4 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

4 hours ago
Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version