దువ్వాడ జగన్నాథమ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- February 7, 2017 / 01:29 PM ISTByFilmy Focus
సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో బన్నీ సరసన ముకుంద ఫేమ్ పూజ హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ టీజర్ విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని హరీష్ శంకర్ నిన్న చెప్పారు. తాజాగా టాలీవుడ్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 24 న ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ఒక్క స్టిల్ కూడా రాలేదు. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ కొత్త లుక్ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు అల్లు అర్జున్ కి మంచి హుషారైన పాటలను ఇచ్చిన రాక్ స్టార్ దేవీ ప్రసాద్ డీజే కోసం అదిరిపోయే ఆల్బమ్ ని ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















