ఆ విషయంలో అల్లు బాబీ ని మెచ్చుకోవాల్సిందే?

Advertisement

ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో పెళ్ళి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. బాబీ కి ఇదివరకే నీలిమ బండి తో వివాహం జరిగింది. వీరిద్దరికీ అన్విత అనే పాప కూడా ఉంది. ఆయితే వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతో 2016 విడాకులు తీసుకున్నారు. అయితే వీరి కూతురు కోసం మాత్రం అప్పుడప్పుడూ కలుస్తుంటారు. అల్లు ఫ్యామిలిలో కుంటుంబం లో ఏ ఫంక్షన్ జరిగినా నీలిమ కూడా హాజరవుతుందట. తాజాగా ఈ విషయం పై అల్లు బాబీ స్పందించాడు.

బాబీ స్పందిస్తూ.. “విడాకులు తీసుకున్నప్పటికీ నీలిమ ఎప్పటికీ మా కుటుంబ సభ్యురాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. మా ఇద్దరికీ అన్విత అనే పాప కూడా ఉంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనా పాపకోసం బాబీ, నీలిమ లు ఇలా కలుసుకుంటూ ఉండడం మెచ్చుకోదగిన విషయమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus