టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు శిరీష్ (Allu Sirish) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక సందర్భంలో అల్లు శిరీష్ చరణ్(Ram Charan) , సాయితేజ్ (Sai Tej), తన కుటుంబంలోని ఇతర హీరోల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మా కుటుంబంలో రామ్ చరణ్ ఎక్కువగా అల్లరి చేస్తారని కాకపోతే రామ్ చరణ్ అల్లరి చేసే వ్యక్తిలా కనిపించడని అల్లు శిరీష్ వెల్లడించారు.
రామ్ చరణ్ బుద్ధిమంతుడులా కనిపిస్తాడు కానీ చేసేవి చేస్తాడని ఆయన పేర్కొన్నారు. మా కుటుంబంలో సాయితేజ్ బుద్ధిమంతుడని అన్నీ నిజాలు చెప్పేస్తాడని అందువల్ల సాయితేజ్ ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే భయం అని అల్లు శిరీష్ వెల్లడించారు. సాయితేజ్ మా గ్యాంగ్ లో ఉంటే ఎక్కడ దొరికిపోతామో అని భయం వేస్తుందని ఆయన కామెంట్లు చేశారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
చరణ్ అల్లరి మామూలుగా ఉండదని కామెంట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ నెల 20 నుంచి బుచ్చిబాబు (Buchi Babu Sana) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు కథ ప్రకారం పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టైటిల్ వెనుక కారణాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని సమాచారం.
చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగేలా బుచ్చిబాబు ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!