కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు అల్లు శిరీష్. వర్కవుట్స్ ఎలా చేయాలి.. ఫిట్‌గా ఎలా ఉండాలి అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయి.. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు ఇప్పుడు. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియో అప్‌లోడ్ చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తొలి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపించారు. జిమ్‌లో ఈయన ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియోలో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూస్తున్నాం.. 30 సెకన్ల వీడియోలో జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఇందులో చూపించారు.
ఈ వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. దాంతో పాటు అభిమానుల కోసం మనసులో మాట రాసుకొచ్చారు అల్లు శిరీష్. తన వర్కవుట్ షెడ్యూల్‌లో చాలా రకాల ఫిట్ నెస్ సూత్రాలు దాగున్నాయి. ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన విషయాలు కూడా చూపించబోతున్నారు. తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు శిరీష్. ఇప్పుడు తన ఫాలోయర్స్ కోసం కూడా వీడియోలు పెట్టి.. ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అల్లు శిరీష్.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?