Alluri Collections: పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది

శ్రీవిష్ణు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కొట్టడానికి చాలా తిప్పలు పడుతున్నాడు. ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ వంటి చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘అల్లూరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా… బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరించారు.

సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.07 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.05 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.05 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.41 cr

‘అల్లూరి’ చిత్రానికి రూ.3.42 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.29 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు మార్నింగ్ షోలు పడకపోవడం పెద్ద దెబ్బ అని చెప్పాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus