శివ కార్తికేయన్ (Sivakarthikeyan) , సాయి పల్లవి (Sai Pallavi) ..ల లేటెస్ట్ మూవీ ‘అమరన్’ (Amaran) దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళ/ తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రాన్ని మలిచారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం.
ఇప్పుడు వీక్ డేస్ లోకి ఎంటర్ అయినా జోష్ తగ్గలేదు అనే చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.15 cr |
సీడెడ్ | 1.52 cr |
ఉత్తరాంధ్ర | 1.58 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.66 cr |
కృష్ణా + గుంటూరు | 0.97 cr |
నెల్లూరు | 0.28 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 10.16 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 6 రోజులు ముగిసేసరికి రూ.10.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.5.16 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ వరకు స్టడీగా కలెక్ట్ చేస్తే మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.