Allu Aravind: ‘తండేల్’ సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!

‘తండేల్’ ’ (Thandel)  చిత్రం 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti) కూడా స్పందించారు. ‘మా సినిమా సంక్రాంతి కంటే ముందే రెడీ అయిపోతుంది. రామ్ చరణ్  (Ram Charan)  ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా ఉంది అని భావించి అల్లు అరవింద్ (Allu Aravind) గారు పోస్ట్ పోన్ చేస్తే చేయవచ్చు తప్ప.. మేము అయితే సంక్రాంతికి రెడీగా ఉంటాం’ అని చందూ మొండేటి బహిరంగంగా చెప్పడం జరిగింది.

Allu Aravind

దీంతో ‘ ‘తండేల్’ యూనిట్ కి సంక్రాంతి సీజన్ పై చూపు పడింది’ అనే చర్చ కూడా నడిచింది. అయితే ఉన్నట్టుండి ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ‘మాకు అసలు సంక్రాంతికి వచ్చే ఆలోచనే లేదు. ఆ వార్త వైరల్ అవ్వడం మమ్మల్ని టెన్షన్ కి గురి చేసింది’ అంటూ అల్లు అరవింద్ (Allu Aravind) పలికారు. అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత తలుచుకుంటే.. ‘తండేల్’ ని సంక్రాంతి రేసులో స్ట్రాంగ్ గా రంగంలోకి దింపడం పెద్ద విషయం కాదు.

కానీ సోలో రిలీజ్ చేస్తే లాంగ్ రన్ కలిసొస్తుంది అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లు అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అంతేకాదు ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 ని విడుదల చేయాలని అనుకున్నారట.కానీ ఎందుకు ఆ డేట్ కి విడుదల చెయ్యట్లేదు అనే విషయం పై కూడా అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వలేదు. ‘పుష్ప 2’ (Pushpa 2) లాంగ్ రన్ కి అడ్డు పడకూడదు అనే ఉద్దేశంతో డిసెంబర్ 20 నుండి వెనక్కి జరిగుండొచ్చు.

ఇక సంక్రాంతి సీజన్ కి రావాలనే ఆశ ఉన్నా.. చరణ్ సినిమాతో పోటీకి వచ్చి, ఫ్యామిలీలో ఉన్న గొడవలు నిజమే అని చాటి చెప్పినట్టు కూడా ఉంటుంది. ఈ కారణంతో కూడా అల్లు అరవింద్ ‘తండేల్’ ని వెనక్కి జరిపి ఉండవచ్చు. కానీ ఆయన బయటపడలేదు. ఏదేమైనా ఫిబ్రవరి 7 డేట్ మంచిదని ఆయన భావిస్తున్నారు. చూద్దాం.. ఆ డేట్ కి వచ్చి ఎలా క్యాష్ చేసుకుంటుందో..!

ఖైదీ-2లో స్టార్ హీరోల గ్యాంగ్.. !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus