Bunny Vasu: నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

వంద కోట్ల క్లబ్ అనేది అక్కినేని అభిమానులకి తీరని కలగా ఉంది. నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య (Naga Chaitanya) , అఖిల్ (Akhil Akkineni)..లు సోలో హీరోలుగా చేసిన ఒక్క సినిమా కూడా వంద కోట్ల మార్క్ ను టచ్ చేయలేదు. మిగిలిన హీరోల్లో చాలా మంది వంద కోట్ల క్లబ్లో చేరారు. సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), నిఖిల్ (Nikhil Siddhartha), నాని (Nani) వంటి హీరోలు వంద కోట్ల క్లబ్లో చేరారు. కానీ అక్కినేని హీరోలు ఈ విషయంలో వెనుకబడ్డారు. అన్నీ ఎలా ఉన్నా..గత 3 ఏళ్లుగా అక్కినేని హీరోలు సరైన సక్సెస్ అందుకోలేదు.

Bunny Vasu

‘బంగార్రాజు’ (Bangarraju) ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సంక్రాంతి సినిమాలు కాబట్టి.. సేఫ్ అయ్యాయి తప్ప. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు అయితే చేయలేదు. పెద్ద బడ్జెట్లో చేసిన ‘ఘోస్ట్’ (The Ghost) ‘కస్టడీ’ (Custody) ‘ఏజెంట్’ (Agent) సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో అక్కినేని అభిమానులు కొంచెం డల్ అయ్యారు. అయితే వారందరికీ నిర్మాత బన్నీ వాస్ భరోసా ఇచ్చాడు. ‘ఫిబ్రవరి 7 కి ముందు షాపింగ్ కి వెళ్లి నచ్చిన షర్ట్ కొనుక్కోండి. అది వేసుకుని ‘తండేల్’ వచ్చి చూడండి.

సినిమా చూశాక అందరూ కాలర్ ఎగరేస్తారు. నాగ చైతన్యని, ‘తండేల్’ (Thandel)  ని వంద కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాను. ‘100 పర్సెంట్ లవ్’ తో నన్ను సంపూర్ణ నిర్మాతగా చేసింది నాగ చైతన్య. అంతకు ముందు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కో ప్రొడ్యూసర్..గా ఉండేవాడిని. అందుకే నన్ను కంప్లీట్ ప్రొడ్యూసర్ ని చేసిన నాగ చైతన్యకి పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది’ అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు బన్నీ వాస్ (Bunny Vasu). మరి అతని మాటలు ఫిబ్రవరి 7న నిజమవుతాయేమో చూడాలి.

పూజా హెగ్డే.. పోటీ ఎక్కువైనా సైలెంట్ గా కాజేస్తోంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus