Chinmayi Sripada: మరోసారి చిన్మయి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

పిల్లల పర్మిషన్ లేకుండా కిస్ చేయకూడదు, హగ్ చేయకూడదు అంటుంది గాయని చిన్మయి (Chinmayi Sripada)  . ఆమె ఏం మాట్లాడినా చాలా బోల్డ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిన్మయి.. సామాజిక అంశాల పై తన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. చిన్మయి మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి మా పాప లేదా బాబు..చెప్పే ‘నో’ ని మనం రెస్పెక్ట్ చేయాలి.

Chinmayi Sripada

వాళ్లకి ఇష్టం లేకుండా హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే నా పిల్లలకు ఇష్టం లేకుండా నేను వాళ్ళని దగ్గరికి తీసుకుని బలవంతంగా కిస్ చేయను.వాళ్ళు ఇష్టంతో వస్తే దగ్గరకు తీసుకుని హత్తుకుంటాను.’నో’ అనే పదానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చిన్నప్పటి నుండే వాళ్ళకి అలవాటు చేయాలి.పేరెంట్స్ కూడా వాళ్ల ‘నో’ ని గౌరవించాలి.

బయట వాళ్ళు గౌరవించకపోయినా వచ్చి నాకు చెప్పమంటాను. చిన్న పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మనం అడల్ట్స్ గా ఉన్న ఈ టైంలో ఎలా ఉన్నామో, ఎలా ప్రవర్తించామో.. వాళ్ళు మనకంటే ఎక్కువగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి మనం కూడా అంటాం.. ఎక్కడి నుండి ఇవన్నీ నేర్చుకున్నావు అని.? పిల్లల ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.” అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీపావళికి రజనీకాంత్‌ ఇంట్లో భేటీ.. ధనుష్‌ – ఐశ్వర్య గుడ్‌ న్యూస్‌ వింటామా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus