శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi)..లు జంటగా నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళ/ తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అందువల్ల 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీక్ డేస్ కూడా బాగా కలెక్ట్ చేసి మొదటి వారం మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.54 cr |
సీడెడ్ | 1.64 cr |
ఉత్తరాంధ్ర | 1.70 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.71 cr |
కృష్ణా + గుంటూరు | 1.03 cr |
నెల్లూరు | 0.30 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 10.94 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం రూ.10.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.5.94 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.