రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!

పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  , విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati)  కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ (Gopala Gopala) ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. 2015 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాగానే ఆడింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘థాంక్యూ’ అంటూ ఓ వింత ఎక్స్ప్రెషన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty). ఒరిజినల్లో కూడా ఆయన అదే రోల్ చేశారు.

Mithun Chakraborty

ఆ తర్వాత ఈయన పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ అప్పట్లో శ్రీదేవితో డేటింగ్ వార్తలతో ఈయన ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన చిక్కుల్లో పడినట్టు సమాచారం. ఆయన పై ఎఫ్.ఐ.ఆర్ నమోదయ్యిందట. వివరాల్లోకి వెళితే.. మిథున్ చక్రవర్తిపై (Mithun Chakraborty) కోల్‌కతా పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారని సమాచారం.

పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఓ పొలిటికల్ మీటింగ్లో భాగంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారట. దీంతో ఆయన పై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియా లో ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఆ టైంలో మిథున్ చక్రవర్తి.. ‘2026 లో పశ్చిమ బెంగాల్ పీఠం బీజేపీ వశం కాబోతుంది.

లక్ష్య సాధన కొరకు ఏం చేయడానికైనా మేము సిద్ధం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు ఓటు వేసేవాళ్ళని ఎవరూ భయపెట్టలేరు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అవి జనాలని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులు అందటంతో బిదాన్ నగర్ సౌత్ పోలీసులు మిథున్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారట. దీనిపై మిథున్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అనిరుధ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్న సినిమా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus