బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో అమర్ దీప్ అర్జున్ మొదటి నుంచి కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. అయితే అర్జున్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అమర్ ను చాలా దూరం పెడుతూ వచ్చారు. టాస్కుల విషయంలో అయితే అమర్ దీప్ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే ఈ వారం జరిగిన టికెట్ టూ ఫినాలే రేసులో భాగంగా ఎవరి సహాయం లేకుండా అర్జున్ మొదటి ఫైనలిస్ట్ గా ఫైనల్స్ కి చేరుకున్నారు.
ఇలా ఈయన మొదటి ఫైనల్ లిస్ట్ గా హౌస్ లోకి చేరుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలలో భాగంగా అర్జున్ చెప్పినటువంటి రీజన్స్ పెద్దగా ఎవరికి నచ్చలేదని చెప్పాలి. అయితే తాజాగా అమర్ భార్య తేజస్విని అమర్ పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజు స్పందిస్తూ అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో చాలా దూరం పెడుతున్నారు
ఆ విషయం తనకు చాలా బాధ పెడుతుందని ఈమె తెలియజేశారు. అర్జున్ అంటే ఆమెకి మొదటి నుంచి కూడా ఎంతో మంచి అభిప్రాయం ఉంది బయట వీరిద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత అర్జున్ అమర్ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు అలా చేయడం నాకు చాలా బాధ కలిగించిందని తేజు తెలిపారు.
టాస్కుల పరంగా అర్జున్ (Amardeep) అమర్ ని దూరం పెడితే నేను అంతగా బాధపడే దాన్ని కాదు కానీ నిజంగానే అర్జున్ అమర్ ని దూరం పెడుతున్నారని ఈ విషయం తన హౌస్ లోకి వెళ్లేటప్పుడే చెబుదాము అనుకున్నాను కానీ చెప్పలేకపోయానని తెలియజేశారు. అర్జున్ బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు కూడా నేను తనతో చాలా విషయాలు గురించి మాట్లాడాను. అలాగే హౌస్ లోకి వెళ్లిన తర్వాత అమర్ తో మాట్లాడిన తర్వాత ఎక్కువగా అర్జున్ తోనే మాట్లాడానని ఈ సందర్భంగా తేజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.