ఇంట్రెస్టింగ్ రోల్స్ లో విజయ్ సేతుపతి అండ్ బచ్చన్!
- August 27, 2017 / 06:24 PM ISTByFilmy Focus
చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న “సైరా నరసింహా రెడ్డి” పోస్టర్ విడుదల నుండే విశేషమైన అంచనాలు క్రియేట్ చేసింది. అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి మల్టీ లాంగ్వేజస్ లో క్రేజ్ ఉన్న నటుల్ని ఎంపిక చేయడం.. రెహమాన్ ను సంగీత దర్శకుడిగా, రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయ్. ఇప్పుడు “సైరా నరసింహారెడ్డి”లో అమితాబ్, సేతుపతిల క్యారెక్టర్స్ గురించి కొత్త ఇన్ఫో వచ్చింది.
అదేంటంటే.. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో చిరంజీవి గురువుగా కనిపించనుండగా.. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నాడు. మొదట్లో నెగిటివ్ గా ఉన్నప్పటికీ.. తదుపరి చిరంజీవికి సపోర్ట్ చేసే సైనికాధికారిగా సేతుపతి పాత్ర ఉండబోతోందని సమాచారం. ఇంకా చిత్రీకరణ ప్రారంభమవ్వకముందే క్యారెక్టర్స్ గురించి డీటెయిల్స్ బయటకి వచ్చేస్తుండడంతో.. మెగా అభిమానులందరూ ఖుషీ అవుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















