RC 17: చరణ్ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్.. హింట్ ఇచ్చిన నిర్మాత
- November 28, 2026 / 04:47 PM ISTByFilmy Focus Desk
రామ్‌చరణ్ – సుకుమార్ సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు వచ్చాయి. అయితే అవి ఆ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయానికి సంబంధించినవే. రీసెంట్‌గా సినిమాకు కొబ్బరికాయ కొట్టేసరికి ఆ వార్తలు ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. లేడీ లీడ్ గురించి సుకుమార్ టీమ్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదిగో అదిగో అంటూ కొంతమంది పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు.
RC 17
ఈ క్రమంలో వినిపించిన పేర్లు చూస్తే.. బాలీవుడ్ నుండి అనీత్ పడ్డా, సారా అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ తర్వాత సౌత్ నుండి శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, అనికా సురేంద్రన్ పేర్లు వినిపించాయి. కొత్త భామల లిస్ట్‌లో అయితే ‘ఆకాశంలో ఒక తార’ సాత్విక వీరవల్లి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే సినిమా టీమ్ ఇంకా ఎవరినీ ఓకే చేయలేదు. కానీ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ చిన్న హింట్ ఇచ్చారు.

‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్‌లో రవిశంకర్ మాట్లాడుతూ.. మొన్నీమధ్య మా పెద్ద సినిమా ఆడిషన్‌లో సాత్వికను చూశానని.. బాగా చేసిందని.. పెద్ద హీరోయిన్ అవుతుందని గొప్పగా చెప్పారాయన. దీంతో సినిమా హీరోయిన్ ఆడిషన్లు జరుగుతున్న రామ్‌చరణ్ సినిమానే ఆ సినిమా అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. కావాలనే ఆయన హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా సిటీలోనే ఉంటుందని.. దానికి సాత్విక సెట్ అవుతుందని అంటున్నారు.
మరి రవిశంకర్ హింట్ పని చేస్తుందా? సుకుమార్ ఆమెను ఓకే చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త హీరోయిన్లను తీసుకొని సినిమాలు చేయడం ఇటీవల సుకుమార్ తగ్గించేశారు. కాబట్టి సాత్విక ఎంపిక నిజమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నాగచైతన్య సినిమాలో కూడా సాత్విక ఓకే అయిందని సమాచారం. త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుందట.
















