Amitabh: ఎన్టీఆర్ సినిమాలో అమితాబ్… భారీగానే ప్లాన్ చేసిన ప్రశాంత్?

  • December 1, 2023 / 06:57 PM IST

కేజిఎఫ్ సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన తదుపరి సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించ బోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో అమితాబ్ చేయబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. సలార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తన డ్రీం ప్రాజెక్టు చేయబోతున్నానని తెలియజేశారు. అంతేకాకుండా తాను చనిపోయే లేపు ఒకసారైనా కూడా అమితాబ్ బచ్చన్ గారితో సినిమా చేయాలన్నదే తన కళ అంటూ ఈయన తెలియజేశారు. ఇక అమితాబ్ గారితో హీరోగా కాకుండా ఆయనని విలన్ పాత్రలలో ప్రేక్షకులకు చూపించాలన్నదే నా కల అంటూ ఈయన తెలిపారు.

ఇలా ప్రశాంత్ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి అలాగే (Amitabh) అమితాబ్ గారిని విలన్ గా చూడాలి అనుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో బహుశా ఎన్టీఆర్ సినిమాలో అమితాబ్ ను విలన్ గా చూపించే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే కనుక నిజమైతే సినిమా మరో లెవల్ లో ఉండబోతుందని చెప్పాలి ఇక ఈ మధ్యకాలంలో అమితాబ్ సైతం బాలీవుడ్ సినిమాలను తగ్గించి పూర్తిగా సౌత్ సినిమాలపైనే ఆసక్తి చూపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus