Amitabh, RGV: అమితాబ్‌తో వర్మ కొత్త సినిమా… త్వరలోనే!

  • June 16, 2022 / 11:32 AM IST

రామ్‌గోపాల్‌ వర్మ ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు, ఆయన అభిమానులు తలదించుకునే సినిమాల అయినా చేసుండొచ్చు. అయితే పెద్ద హీరోలతో సినిమా చేసినప్పుడు మాత్రం వాళ్ల అభిమానులకు ఇబ్బంది ఉండకుండా చూసుకుంటారు. ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా చేసేటప్పుడు వర్మ సినిమాలు ఆ రేంజిలోనే ఉంటాయి. తెలుగులో కూడా పెద్ద వర్మ హీరోలతో సినిమాలు చేస్తే ఇలానే ఉంటాయి. అయితే ఆ సినిమా ఫలితం సంగతి వేరే విషయం. ఇప్పుడు తనకు బాలీవుడ్‌ బీభత్సమైన ఇమేజ్‌ను తీసుకొచ్చిన అమితాబ్‌ బచ్చన్‌తో రామ్‌గోపాల్‌ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు.

అయితే ఇది హారర్‌ సినిమా కావడం గమనార్హం. హారర్‌, థ్రిల్లర్‌ సినిమాల విషయంలో వర్మను కొట్టేవారు లేరని చెబుతుంటారు. వైవిధ్యం చూపించాలి అంటే అమితాబ్‌ బచ్చన్‌ మించినోళ్లు లేరు. ఈ ఇద్దరు కలసి హారర్‌ సినిమా చేస్తే ఓ లెవల్‌లో ఉంటుంది అని చెప్పేయొచ్చు. ఆ సినిమాను నవంబరులో ప్రారంభిస్తామని చెప్పారు వర్మ. అన్నీ అనుకున్నట్లుగా సాగితే వర్మ ఎలాంటి సినిమానైనా రెండు, మూడు నెలల్లో రిలీజ్‌కి రెడీ చేసేస్తారు.

మరిప్పుడు అమితాబ్‌తో చేయబోయే హారర్‌ సినిమా ఎన్ని రోజుల్లో తీస్తారు, ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనేది చూడాలి. బిగ్ బితో వర్మ గతంలో గతంలో ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’, ‘సర్కార్ 3’, ‘ఆగ్’, ‘నిశ్శబ్ద్’ లాంటి సినిమాలు తీశారు. అందులో ‘సర్కార్’ సినిమా సంచలన విజయం అందుకోగా, ‘నిశ్శబ్ద్’ కేవలం సంచలనాత్మక చిత్రంగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత అమితాబ్‌తో వర్మ సినిమా చేస్తుండటం ఆసక్తికరమే. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. వర్మ కొత్త సినిమా మాటల్ని అంత త్వరగా నమ్మలేం.

ఏదో అలవోకగా కొత్త సినిమాల్ని అనౌన్స్‌ చేసి ఆ తర్వాత మరచిపోవడం, ఏమైంది అని అడిగితే ‘ఆ రోజు అలా అన్నానా’ అని అనడం వర్మకు బాగా అలవాటు. కాబట్టి బిగ్‌బీతో చేస్తాను అని చెబుతున్న సినిమా మొదలై, షూటింగ్‌ పూర్తయి, విడుదలైనంతవరకు డౌటే. వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీనే.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus