నాటుగా మారిపోయిన క్యూట్ హీరోయిన్

  • July 4, 2018 / 05:57 AM IST

ఈమధ్యకాలంలో హీరోలు తమ ప్రతి సినిమాలో ఎంత కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారో.. హీరోయిన్లు కూడా అదే తరహాలో సరికొత్తగా తమను తాము ప్రెజంట్ చేసుకొంటున్నారు. ఇటీవలకాలంలో రెజీనా “అ!” సినిమాలో తన స్టైలిష్ లుక్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ చిత్రం “ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ” చిత్రంలోని రోనీ మారా అనే హాలీవుడ్ తార స్టైల్ నుంచి రెజీనా ఇన్స్పైర్ అయ్యి సరికొత్త లుక్ లో మెప్పిస్తే.. ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ రెజీనాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ స్టైల్ ను ఫాలో అవుతోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు అందాల భామ అమైరా దస్తూర్.

ప్రస్తుతం హిందీలో “రాజ్ మా చావల్” అనే చిత్రంలో రెబల్ లేడీ గా నటిస్తున్న అమైరా ఆ సినిమాలో తన లుక్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకూ క్యూట్ లుక్స్ తో కనిపించిన అమైరాను ఇలా టిపికల్ లుక్ తో చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. అమ్మడు బాలీవుడ్ లో “ప్రస్థానం” రీమేక్ లో కూడా నటించే అవకాశం సొంతం చేసుకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus