Vijay Devarakonda: లైగర్ లో విజయ్ అలా కనిపిస్తారా..?

  • July 19, 2021 / 01:12 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లైగర్ అనే పేరు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వాళ్లు కావడం వారి బిడ్డలో అరుదైన ప్రతిభ ఉండటంతో ఈ సినిమాకు లైగర్ అని పెట్టారని వినిపిస్తోంది.

మరోవైపు సినిమాలో హీరోకు నత్తి అని టకు బదులుగా ల అని పలుకుతాడని ఆ రీజన్ వల్లే సినిమాకు లైగర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లైగర్ తో బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.

లైగర్ లో విజయ్ నిజంగానే నత్తి ఉన్న వ్యక్తిగా కనిపిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారు. విజయ్ గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఈ మూవీతో విజయ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశిస్తున్నారు. పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా లైగర్ కావడం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus