అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటులు. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఇద్దరిలో ఎవరు మంచి నటుడు.. ఎవరు గొప్ప?’ అని అడిగితే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే కమల్ హాసన్ కు భయపడి అమితాబ్ బచ్చన్ ఓ సినిమాని వదులుకున్నారట. వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదూ.? అయినప్పటికీ ఇది నిజమే..! ఈ విషయాన్ని బయట పెట్టింది మరెవరో కాదు ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నటుడు అయిన భాగ్యరాజ్. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో నేను ‘ఖబద్దార్’ అనే సినిమా తెరకెక్కించాలనుకున్నాను. ఈ చిత్రం కోసం నేను అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే.. మొదట ఓకే అన్నారు. అయితే నేను ఫుల్ స్క్రిప్టు చెప్పాక ఆయన కమల్‌కు భయపడి వెనకడుగు వేశారు. ఆ సినిమా క్లైమాక్స్లో కమల్ హాసన్ పాత్ర చనిపోతుంది. కమల్ పాత్ర చనిపోవడమే ఆ సినిమాకి సరైన జడ్జిమెంట్. కానీ ‘కమల్ పాత్ర చనిపోతే.. అదే సినిమాలో హైలైట్ అవుతుందని..
చనిపోయే ముందు సన్నివేశంలో కమల్ నటన ముందు నేను తేలిపోతానని’ అమితాబ్ భయపడ్డారు. ఆయన ఈ విషయాన్ని ఓపెన్‌గానే నాతో చెప్పారు. ఈ సినిమా ‘నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని .. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ పేరు పోకూడదు.ఈ సినిమా నేను చేయలేను.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తాను’ అని అమితాబ్ తప్పుకున్నారు” అంటూ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!