38 సంవత్సరాల మెగాస్టార్ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

  • April 23, 2020 / 07:33 PM IST

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982 ఏప్రిల్ 23 విడుదల అయ్యి నేటికీ 38 సంవత్సరాలు.ఈ చిత్రం లో రాజశేఖరం గా చిరంజీవి, జయ లక్ష్మి గా మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు.ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు తొలి సారీ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయగా గొల్లపూడి మారుతీరావు గారు తొలి సారీ నటించి అద్భుత మైన మాటలు అందించారు.

కథ లో క్లుప్తం గా రాజశేఖరం(చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు(గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ. ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు 2 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయ్యింది.

హైదరాబాద్ సిటీ లో డైరెక్ట్ రిలీజ్ లో శాంతి (నారాయణ గూడ) లో 3 ఆటలు -106. డైరెక్ట్ రన్ మరియు నాంపల్లి – లత లో ఉదయం ఆటలు -52 రోజులు డైరెక్ట్ రన్ + షిఫ్ట్ పై సిటీ లో 519 రోజులు రన్ కావటం విశేషం.]

1

2

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus