Jagadeka Veerudu Athiloka Sundari: 33 ఏళ్ళ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి ఆసక్తికర విషయాలు!

  • May 10, 2023 / 12:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. దివంగత స్టార్ హీరోయిన్, అందాల నటి అయిన శ్రీదేవి హీరోయిన్ గా .. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ఈ చిత్రం విడుదలయ్యి నేటితో 33 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అందుకే #33YearsForIHJVAS’ ‘#33YearsForJVAS’ అనే హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 1990 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ 33 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) అప్పట్లో చిరంజీవి తనకు కలిసొచ్చిన దర్శకులు కోదండ రామిరెడ్డి, కె.రాఘవేంద్ర రావు లతో సీక్వెన్స్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘కొండవీటి దొంగ’ వంటి సూపర్ హిట్ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు.

2) ఈ క్రమంలో కె.రాఘవేంద్ర రావు గారు రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా ఏదైనా కొత్త కథతో సినిమా చేద్దాం అన్నారు. అశ్వినీదత్ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఓ వజ్రాల నిధి అన్వేషణతో కూడుకున్న ఓ కథని అనుకున్నారు. శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

3) అంతా బాగానే ఉంది అనుకుని షూటింగ్ మొదలుపెట్టారు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే షూటింగ్ ఆపేసి మళ్ళీ.. ఆలోచనలో పడ్డారు. పలు సిట్టింగ్ ల అనంతరం.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఆలోచన తట్టింది. చిరుకి అత్యంత సన్నిహితుడు అయిన యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి కథ అందించారు.

4) అయితే ఆయన ఆలోచన ప్రకారం.. దేవలోకం నుండి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకానికి వచ్చి ఇక్కడ స్థిరపడుతుంది.అయితే ముందుగా హీరో హీరోయిన్ లు కలుసుకునే సీన్ ను కాదు కాదు థీమ్ ను మార్చేశారట. ‘గాయపడిన పాప… చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న హీరో…. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు… చంద్రుడి పైకి ఒక మిషన్ ను పంపాలని అనుకుంటారు. అందుకోసం స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళ్ళి వచ్చిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన చిరు స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడికి విహరించేందుకు వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగొట్టుకుంటుంది. అది కాస్త చిరుకు దొరకడం… ఇది తెలుసుకున్న హీరోయిన్(శ్రీదేవి)… హీరోని(చిరుని) వెతుక్కుంటూ భూమి మీదకు వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ.

5) అయితే… చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవు అని చిరుకి అనిపించింది.కె.రాఘవేంద్రరావు కూడా ఇదే భావించి జంధ్యాలని రంగంలోకి దింపారు. ‘ఆయన హీరో… మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లు వచ్చినట్టు పెడదాం అని చెప్పగా… దానిని ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు.

6) ఫైనల్ గా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. సరిగ్గా 68 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేశారు.

7) ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కె.రాఘవేంద్ర రావు గారు. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కాకపోతే రిలీజ్ టైంకి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. అది తుఫాన్ గా కూడా మారింది. రిలీజ్ టైంకి ప్రింట్లు అందలేదు.

8) అశ్వినీదత్ ఏమో ఈ ప్రాజెక్ట్ మీద రూ.9 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేశాడు. ఏదైతే అదయ్యింది అని ప్రింట్లు పంపే ప్రయత్నం చేశారు. అవి చేరతాయో లేదో తెలీదు. షోలు పడతాయో లేదో తెలీదు. పడినా జనాలు థియేటర్లకు వస్తారో రారో తెలీదు. అసలు మే నెలలో వర్షాలు ఏంటి అని జుట్టు పీక్కొని మెంబెర్ టీంలో లేడు అంటే అతిశయోక్తి లేదు.

9)అయినా సరే మొండిగా సినిమాని రిలీజ్ చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లడంతో తుఫాన్ ను లెక్కచేయకుండా జనాలు థియేటర్లకు తరలివచ్చారు.

10) థియేటర్లో మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నా లెక్క చేయకుండా జనాలు కూర్చుని సినిమా చూశారు. తర్వాత రోజుల్లో ప్రింట్లు ఇంకా పెంచడం. మొదటి రోజుకంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం ఈ సినిమాకే జరిగింది.

11) 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ.. రూ.12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

12) ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీదేవికి డూప్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ నటించింది.

13) అజిత్ భార్య షాలిని, అలాగే ఆమె చెల్లెలు షామిలి ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus