Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

పాటల్లో హుక్‌ స్టెప్‌ ఉండటం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. అయితే హుక్‌స్టెప్‌ పేరు మీద పాటను పెట్టేశారు అనిల్‌ రావిపూడి. ఆ పాటకు ఇప్పుడు ఇటు యూత్‌, అటు అంకుల్స్‌ స్టెప్పులేసి తెగ సందడి చేస్తున్నారు. అంతలా ఆ పాట బీట్‌, స్టెప్పులు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. పాట, బీట్‌ వెళ్లడానికి కారణం సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో, గాయకుడు బాబా సెహగల్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. రెండున్నర నిమిషాల ఈ పాట కావడంతో అప్పుడే అయిపోయిందా అని మూవీ గోయర్స్‌ నిరాశ చెందుతున్నారు కూడా.

Hook Step

ఇక ఇలాంటి పాటలో హుక్‌ స్టెప్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది ఆట సందీప్‌ మాస్టర్‌. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. వాళ్లు కూడా ఆ పాట గురించి తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే వారు ఇచ్చిన హుక్‌ స్టెప్‌ ముందు జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల అనిల్‌ రావిపూడి – చిరంజీవి చెప్పుకొచ్చారు. వెంకటేశ్‌తో కలసి ఇటీవల చేసిన ఓ ఇంటర్వ్యూలో హుక్‌ స్టెప్‌ పాట గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు చిరంజీవి.

చిరంజీవి ఆ పాట కోసం సందీప్‌ మాస్టర్‌ని ఎంకరేజ్‌ చేశారు. ఆయనేమో ఈఎంఐల కోసం బ్యాంకుల వాళ్లు ఫోన్లు మీద ఫోన్లు చేస్తుంటే వచ్చిన చిరాకుతో ఆ స్టెప్‌ కంపోజ్‌ చేశారు అనేది మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ స్టెప్‌ ముందు కనిపించే పాత హుక్‌ స్టెప్‌ల వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. సెట్స్‌లో ఆ చిన్న బీట్‌ కోసం సందీప్‌ మాస్టర్‌ చాలా ట్రై చేశారట. తమిళ కుత్తు స్టెప్పులు కూడా అనుకున్నారట. ఆఖరికి ఈ ఇబ్బంది చూసి చిరంజీవి ముందుకొచ్చి ఇప్పుడున్న స్టెప్పులు వేశారట.

‘హుక్‌ స్టెప్‌.. హుక్‌ స్టెప్‌..’ అనే బీట్‌ వినిపించినప్పుడు ఏదేదో ఆడటం ఎందుకు అనుకొని తన పాత హుక్‌ స్టెప్పులను కాస్త చేసి ఆపేలా చేశారట. దీంతో ఆ తర్వాత వచ్చిన హుక్‌ స్టెప్‌ అందంగా, ఆసక్తికరంగా మారింది అని చిరంజీవి చెప్పారు. ఇదన్నమాట హుక్‌ స్టెప్‌ ప్రిపరేషన్‌ ముచ్చట.

 టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus