Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

వినోదాన్ని మించిన ఆయుధం లేదు అంటారు టాలీవుడ్‌లో. ఇది ఇప్పటి మాట కాదు.. మేం అంటున్న మాట కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ టాపిక్‌ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. టాలీవుడ్‌లో వచ్చే సినిమాల్లో విజయాలు అందుకున్నవాటిని తీస్తే అందులో కామన్‌గా కనిపించే అంశం వినోదం. రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటి వినోదాన్ని ఎవరు బాగా హ్యాండిల్‌ చేస్తే వారే వీరుడు. ఈ మాటను నిరూపించిన దర్శకులే ఇప్పటికీ స్వింగ్‌లో ఉన్నారు. ఆ కత్తిని వాడటంతో కాస్త శ్రుతి తప్పితే కెరీర్‌లు ముగిసిపోయాయి.

Tollywood

అంతటి బలమైన వినోదం ప్రాధాన్యత గురించి మరోసారి టాలీవుడ్‌కి తెలియజేసింది ఈ సంక్రాంతి. కావాలంటే మీరే చూడండి ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు ఇదే అంశం చుట్టూ తిరిగాయి. ప్రభాస్‌ – మారుతి ‘ది రాజా సాబ్‌’, చిరంజీవి – అనిల్‌ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’, రవితేజ – కిషోర్‌ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్‌ పొలిశెట్టి – మారి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్‌ – రామ్‌ అబ్బరాజు ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాల్లో వినోదం బాగా వర్కవుట్‌ అయింది. అయితే ఏ, బీ, సీ సెంటర్లు అనే తేడా లేకుండా ఆ వినోదాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

మామూలుగా టాలీవుడ్‌లో ట్రెండ్‌ని పట్టేసి ఆ తర్వాత అలాంటి సినిమాలు చేస్తూ ఉంటారు మన దర్శకనిర్మాతలు. అయితే ఇప్పుడు ఇదే పాయింట్‌ని టాలీవుడ్ దర్శకనిర్మాతలు అర్థం చేసుకొని జాగ్రత్తగా పాటిస్తే ఇలాంటి విజయాలు తర్వాత కూడా ఆశించొచ్చు. అలా కాకుండా వినోదం నచ్చుతోందని ఓవర్‌ డోస్‌ వేసి సినిమాలు సిద్ధం చేస్తే.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతంలో ఇలానే వరుస కామెడీ సినిమాలు చేసిన హీరోలు, దర్శకులు ఆ తర్వాత విజయాలు అందుకోలేకపోయారు. అందులో శ్రీను వైట్ల లాంటి దర్శకులు, అల్లరి నరేశ్ లాంటి హీరోలు ఉన్నారు. కాబట్టి డోస్‌ ఓవర్‌ అవ్వకుండా చూసుకోవాలి మరి.

‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus