Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

టాలీవుడ్ బాక్సాఫీస్ గ్రాఫ్ చూస్తుంటే 2025 లాగే 2026 సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీ చుట్టూనే తిరిగేలా ఉంది. కిందటి ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సుమారు 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచి మెగా పవర్‌ను నిరూపించింది. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాల టాక్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న పెద్ద సినిమాల లిస్టు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది.

Box Office

ముఖ్యంగా ఈ సంవత్సరం మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి ఇతర టాప్ స్టార్ల సినిమాలు థియేటర్లకు వచ్చే అవకాశం లేదు. మహేష్ బాబు-రాజమౌళి మూవీ ‘వారణాసి’ తో పాటు అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌ల చిత్రాలు 2027లో విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇచ్చే ఇతర పెద్ద సినిమాలు లేవనే చెప్పాలి.

సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ తన ఫుల్ రన్‌లో 300 కోట్ల గ్రాస్ మార్కును సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుకబడటంతో, చిరంజీవి సినిమాకి మరింత అడ్వాంటేజ్ దక్కింది.

అయితే చిరంజీవి సృష్టించబోయే ఈ రికార్డును రామ్ చరణ్ ‘పెద్ది’ క్రాస్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. మార్చి 27న విడుదల కాబోతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ పెద్ది గనుక బాక్సాఫీస్ దగ్గర గట్టిగా సౌండ్ చేస్తే, 2026 టాపర్‌గా రామ్ చరణ్ నిలిచే అవకాశం ఉంది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

చిరంజీవి మరో భారీ చిత్రం ‘విశ్వంభర’ కూడా ఈ ఏడాది లైన్లోనే ఉంది. ఇలా ఒకే ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఐదు భారీ చిత్రాలు ఉండటం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలు 2027కి వెళ్లడంతో, 2026 మొత్తం మెగా హీరోల ఆధిపత్యం కొనసాగడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ ఏడాది ముగిసేసరికి మెగా హీరోల్లో ఎవరు నంబర్ వన్ ప్లేస్ లో ఉంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus