Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 2, 2026 / 10:20 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్రమ్ సహిదేవ్ (Hero)
  • సంధ్య వశిష్ట (Heroine)
  • తారక్ పొన్నప్ప, త్రినాధ్ రావ్ నక్కిన,ఇంద్రజ,నందినీ రాయ్, వడ్లమాని శ్రీనివాస రావు, నాయుడు కాండ్రేగుల తదితరులు (Cast)
  • కగేష్ తమ్మినేని (Director)
  • కాండ్రేగుల నాయుడు, త్రినాధ్ రావ్ నక్కిన (Producer)
  • దేవ్ జాండ్ (Music)
  • మాయ వి (Cinematography)
  • శ్రీకృష్ణ అత్తలూరి (Editor)
  • Release Date : 2nd అక్టోబ‌ర్‌ 2026
  • భవ్య శ్రీ మూవీ మేకర్స్ & నక్కిన నెరేటివ్స్ (Banner)

ఈ అక్టోబర్ 2న పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘అనకాపల్లి’ (Anakapalli) అనే సినిమా కూడా ఒకటి. సీనియర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించిన సినిమా ఇది. అగ్ర దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన కథ. స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు కూడా. దీంతో ‘అనకాపల్లి’ సినిమాకి కాస్త ఎక్కువగా పబ్లిసిటీ జరిగింది. మరి ఆ పబ్లిసిటీకి, పెట్టిన బడ్జెట్ కి సినిమా న్యాయం చేసిందా? తెలుసుకుందాం రండి:

Anakapalli Movie Review

Anakapalli Movie Review And Rating

కథ: టైటిల్‌కి తగ్గట్టే అనకాపల్లిలో 2012 సమయంలో జరిగే కథ ఇది. సూర్య (విక్రమ్ సహిదేవ్) ఒక కాలేజీ స్టూడెంట్. అతని తండ్రి సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కరెంట్ ఆఫీసులో ఏఈగా పనిచేస్తుంటాడు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన తండ్రి ఏమీ వెనకేసుకోలేదనే అసంతృప్తితో సూర్య ఉంటాడు. అదే సమయంలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) అనే రౌడీషీటర్ లగ్జరీలు, ఫాలోయింగ్ చూసి అతనికి ఫ్యాన్ అయిపోతాడు. ఒకరోజు అతని గ్యాంగ్‌లో కూడా చేరిపోతాడు. సూర్య ప్యాషన్ చూసి చాలా తక్కువ సమయంలోనే అతన్ని ఓన్ చేసుకుంటాడు బుల్లెట్.

సూర్యకు డబ్బు లోటు లేకుండా అన్ని వసతులూ కల్పించి, తన రైట్ హ్యాండ్‌‌గా మార్చుకుంటాడు.అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సూర్య.. అమృత (సంధ్య వశిష్ట) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు బుల్లెట్ సాయం తీసుకుంటాడు. కానీ ఒకానొక దశలో ఆమె కారణంగా సూర్య, బుల్లెట్‌కి ఎదురెళ్లాల్సి వస్తుంది.అందుకు దారితీసిన కారణాలేంటి? బుల్లెట్, సూర్య ఎలా శత్రువులయ్యారు? బుల్లెట్ బారినుంచి తన కొడుకుని కాపాడుకునేందుకు సూర్య తల్లి జయంతి (ఇంద్రజ) ఏం చేసింది? ఈ కథ మధ్యలో ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని) పాత్ర ఏమిటి? అన్నదే మిగిలిన కథ.

Anakapalli Movie Review And Rating

నటీనటుల పనితీరు: విక్రమ్ సహిదేవ్ గతంలో ‘రౌడీ బాయ్స్’ ‘విర్జిన్ స్టోరీ’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. ఈ సినిమాతో నటుడిగా ఇంప్రూవ్ అయ్యాడు. ఫైట్స్ సీక్వెన్స్..లలో, క్లైమాక్స్ లో హీరోయిన్..కి క్లాస్ పీకే సన్నివేశంలో బాగా చేశాడు. తారక్ పొన్నప్ప నెగిటివ్ రోల్స్ కి పెట్టింది పేరు. కాకపోతే ఈ సినిమాలో సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ సంధ్య వశిష్ట బాగా చేసింది. ఇంటర్వెల్ సీన్ వద్ద కావచ్చు, క్లైమాక్స్ విలన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సన్నివేశాల్లో బాగా చేసింది. కాకపోతే ఈ పాత్రకి సరైన కన్క్లూజన్ ఇవ్వకపోవడం కొంత డిజప్పాయింట్మెంట్.

ఇంద్రజ తల్లి పాత్రలో హుందాగా నటించింది. త్రినాధ్ రావ్ నక్కిన తండ్రి పాత్రలో ఓకే అనిపించినప్పటికీ.. వేరే నటుడు ఉంటే ఆ పాత్ర బాగా ఎలివేట్ అయ్యుండేది. వడ్లమాని శ్రీనివాస రావు ఎప్పటిలానే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.

Anakapalli Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: కగేష్ తమ్మినేని దర్శకుడు అయినప్పటికీ, ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించింది త్రినాధ్ రావ్ నక్కిన. అయితే ఎంత టాప్ డైరెక్టర్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించినప్పటికీ… అతని మార్క్ ఈ సినిమాలో కొంచెం కూడా కనిపించలేదు. బహుశా డైరెక్షన్ విషయంలో అతను జోక్యం చేసుకోలేదేమో. అదే నిజమైతే ఇది సరైన నిర్ణయమే అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కథను సీరియస్‌గానే చెప్పాలి. త్రినాధ్ రావ్ నక్కిన డైరెక్టర్‌గా ఇన్వాల్వ్ అయివుంటే కనుక.. అతని మార్క్ కామెడీని బలవంతంగా ఇరికించాల్సి వచ్చేది. ఆ విషయాలు పక్కనపెడితే.. ‘అనకాపల్లి’ టైటిల్ కార్డ్స్ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా అనిపిస్తుంది.

ఇంటర్వెల్ బ్లాక్ ఎవరూ ఊహించని విధంగా ఉండి, సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం ఒకే పాయింట్ చుట్టూ తిరగడం అనేది కొంత నిరాశపరిచే అంశం. క్లైమాక్స్ మళ్ళీ ట్రాక్‌లో పడింది అనుకున్న టైంలో అనవసరమైన సాగదీతకు పోయారు. ఫైట్ అవ్వగానే శుభం కార్డు వేసేయకుండా.. జాతర ఎపిసోడ్‌ను బలవంతంగా ఇరికించారు అనిపిస్తుంది. కానీ జాతర ఎపిసోడ్ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా.. కథకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీకి వంకలు పెట్టాల్సిన పనిలేదు.

Anakapalli Movie Review And Rating

విశ్లేషణ: ‘అనకాపల్లి’ కథ పాతగానే ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ ట్రాక్ వంటి కొన్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

Anakapalli Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ‘అనకాపల్లి’లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anakapalli Movie
  • #Mahaboob Basha
  • #Sandhya Vasishta
  • #Tarak Ponnappa
  • #Vikram Sahidev

Reviews

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version