Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 27, 2026 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ‌ర్వానంద్‌ (Hero)
  • అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ (Heroine)
  • డింపుల్ హ‌య‌తి, శ‌ర‌త్ లోహిత‌స్య‌, అవినాష్, లాల్ త‌దిత‌రులు (Cast)
  • సంప‌త్ నంది (Director)
  • రాధామోహ‌న్‌ (Producer)
  • భీమ్స్‌ (Music)
  • కిషోర్ కుమార్‌ (Cinematography)
  • త‌మ్మిరాజు (Editor)
  • Release Date : 27th న‌వంబ‌ర్‌ 2026
  • శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌ (Banner)

స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థ‌ల‌ను ఎంచుకుంటూ హీరోగా సినిమాలు చేస్తుంటాడు శ‌ర్వానంద్‌. త‌న స్టైల్‌కు భిన్నంగా మాస్ క‌థ‌తో శ‌ర్వానంద్ చేసిన చేసిన “భోగి” (Bhogi). రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో డింపుల్ హ‌య‌తి ఓ కీల‌క పాత్ర పోషించింది. సెన్సార్ అడ్డంకుల‌తో పాటు పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో భోగి తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆక‌ర్షించింది. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? మాస్ క‌థ‌తో శ‌ర్వానంద్ హిట్టు కొట్టాడా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

Bhogi Movie Review

Bhogi Movie Review & Rating

క‌థ‌: బొగ్గుల‌గుట్ట ఊరికి చెందిన గంగ (శ‌ర్వానంద్‌) క‌మ్మ‌రిప‌నిచేస్తుంటాడు. త‌ల్లిదండ్రులు దూరం కావ‌డంతో త‌న ఐదుగురు చెల్లెళ్ల‌ను క‌ష్ట‌ప‌డిపెంచిపెద్ద‌చేస్తుంటాడు. బొగ్గుల‌గుట్ట ఊరిని ప‌టేల్ (శ‌ర‌త్ లోహిత‌స్య‌) శాసిస్తుంటాడు. ప‌టేల్‌కు ఎదురుచెప్పే ధైర్యం ఎవ‌రికి ఉండ‌దు. ఊరి క్షేమం కోసం అంటూ పూజారి చెప్పిన మాట విని ప‌టేల్ చేస్తోన్నఓ పూజ‌కు గంగ అడ్డు చెబుతాడు. అప్ప‌టి నుంచి గంగ జీవితం క‌ష్టాల్లో ప‌డుతుంది.

త‌న మాట‌ల‌తో పాటు అధికారాన్ని ఎదురించిన గంగపై కోపంతో అత‌డి చెల్లెళ్ల‌ను చంపాల‌ని ప‌టేల్ ప్ర‌య‌త్నిస్తాడు. ప‌టేల్ బారి నుంచి గంగ త‌న చెల్లెళ్ల‌ను కాపాడుకున్నాడా? ప‌టేల్ చేస్తున్న పూజ వెనుకున్న అస‌లు నిజం ఏమిటి? త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై గంగ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? గంగ పోరాటంలో అత‌డికి అండ‌గా నిలిచిన కందుల సులోచన‌తో (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) పాటు మందారం (డింపుల్ హ‌య‌తి)ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Bhogi Movie Review & Rating

న‌టీన‌టుల ప‌నితీరు: కెరీర్‌లో ఎక్కువ‌గా ఫ్యామిలీ, ప్రేమ‌క‌థ‌ల‌తోనే సినిమాలు చేశాడు శ‌ర్వానంద్‌. త‌న పంథాకు భిన్నంగా రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో ఈ సినిమాలో క‌నిపించాడు. గంగ పాత్ర‌లో శ‌ర్వానంద్ మేకోవ‌ర్ బాగుంది. ఈ సినిమా కోసం తెలంగాణ యాస‌లో డ‌బ్బింగ్ చెప్పాడు. పాత్ర కోసం ఏం చేయాలో అంత చేశాడు. కానీ సంప‌త్ నంది ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో శ‌ర్వానంద్ క‌ష్టం వృథాగా మారింది.

కందుల సులోచ‌న పాత్ర‌లో అనుప‌మ ఒదిగిపోయింది. డీ గ్లామ‌ర్ రోల్‌కు న్యాయం చేసింది. కానీ క‌థ‌లో ఆమె పాత్ర‌కు స‌రైన ప్రాధాన్య‌త లేదు. డింపుల్ హ‌య‌తి గెస్ట్ రోల్‌కు త‌క్కువ‌…హీరోయిన్ రోల్‌కు ఎక్కువ అన్న‌ట్లుగా ఉంటుంది. నాలుగైదు సీన్ల‌కే ఆమె పాత్ర ప‌రిమితైమంది. మెయిన్ విల‌న్‌గా శ‌ర‌త్ లోహిత‌స్య అస్స‌లు సెట్ట‌వ్వ‌లేదు.

ప‌టేల్ పాత్ర‌కు త‌గ్గ క్రూర‌త్వం అత‌డి న‌ట‌న‌లో క‌నిపించ‌లేదు. అవినాష్ క్యారెక్ట‌ర్‌తో చివ‌ర‌లో ఓ ట్విస్ట్ ఇచ్చారు డైరెక్ట‌ర్‌. ఆ మ‌లుపు హై మూవ్‌మెంట్ ఇవ్వ‌లేక‌పోయింది. లాల్, రోహిత్ పాఠ‌క్‌తో పాటు చాలా మంది టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఉన్నా ఏ పాత్ర అంత‌గా ఎలివేట్ కాలేదు.

Bhogi Movie Review & Rating

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: ఒక‌ప్ప‌టి మా భూమి నుంచి రంగ‌స్థ‌లం, నార‌ప్ప వ‌ర‌కు భూస్వాముల దోపీడి, కుల వివ‌క్ష నేప‌థ్యాల‌తో గ‌తంలో తెలుగులో చాలానే సినిమాలు వ‌చ్చాయి. వాటి స్ఫూర్తితోనే ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది భోగి తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ పాయింట్‌కు మూఢ‌న‌మ్మ‌కాలు అనే అంశాన్ని కొత్త‌గా జోడించాడు. కానీ కీల‌క‌మైన ఆ పాయింట్‌ను అర్థ‌వంతంగా చెప్ప‌లేక‌పోయారు.

భోగి సినిమాకు లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచారు. ఎగిలివారంగ‌తో పాటు మిగిలిన పాట‌లు, వాటి పిక్చ‌రైజేష‌న్ బాగుంది. ఆదిలాబాల్ ఆందాల‌ను సినిమాటోగ్రాఫ‌ర్ కిషోర్ కుమార్ నాచుర‌ల్‌గా చూపించారు. బొగ్గుల‌గుట్ట విలేజ్ సెట్ అచ్చం ప‌ల్లెటూరి ఫీల్ క‌లిగించింది.

సంప‌త్ నంది చెప్పిన క‌థ‌ను న‌మ్మి ప్రొడ్యూస‌ర్ రాధామోహ‌న్ సినిమా కోసం భారీగానే ఖ‌ర్చుచేశారు. భోగి మేకింగ్ బాగుంది.

Bhogi Movie Review & Rating

విశ్లేష‌ణ‌: ఓ మంచి క‌థ రాసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో దానిని భావోద్వేగాల‌తో తెర‌పై ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో కూడా అంతే కీల‌కం. భోగిలో ఈ రెండు లోపించాయి. త‌ర‌త‌రాలుగా సాగుతోన్న ప‌టేల్ దోపిడీ….అత‌డిని ఎదురించే ఓ సాధార‌ణ యువ‌కుడు… ఇందుకు దారితీసిన ప‌రిస్థితులు…ప్ర‌జ‌ల్లో పేరుకుపోయిన మూఢ‌న‌మ్మ‌కాల పార‌దోలేందుకు క‌థానాయ‌కుడు సాగించే జ‌ర్నీ…ఈ పాయింట్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు త‌గ్గ మంచి స్ట‌ఫ్ ఉంది.

కానీ స్ట్రాంగ్‌ ఎమోష‌న్స్‌తో క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో సంప‌త్ నంది ఫెయిల‌య్యారు. హీరో క‌త్తిప‌ట్టుకొని శ‌త్రువుల‌ను చీల్చి చెండాడుతాడు… ర‌క్తం ఏరులై పారుతుంది..ఆ సీన్ల‌లో ఆడియెన్స్‌ను క‌నెక్ట్ చేసే ఉద్వేగం క‌నిపించ‌దు. హీరోకు జ‌రిగిన‌ అన్యాయానికి అత‌డి పోరాటంలో న్యాయం ఉంద‌నే భావ‌న ఏ కోశ‌న ఆడియెన్స్‌లో క‌ల‌గ‌దు.

సినిమాలో చాలానే పాత్ర‌లు ఉంటాయి. కానీ హీరోతో వారి రిలేష‌న్ కూడా చాలా ఆర్టిఫీషియ‌ల్‌గా ఉంటుంది. డింపుల్ హ‌య‌తి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లాల్ వంటి న‌టుల‌తో హీరో బంధాన్ని స‌రిగ్గా చూపించ‌లేదు. ఇంట‌ర్వెల్‌తోనే క్లైమాక్స్ ఏమిట‌న్న‌ది అర్థ‌మైపోయింది. సెకండాఫ్‌లోనైనా హీరో రివేంజ్‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు డైరెక్ట‌ర్‌. ఫైట్ల‌తో నింపేశాడు.

దాంతో సినిమా మొత్తం సాగ‌తీత‌గా మారింది. మూఢ‌న‌మ్మ‌కాలు, థ‌ర్మ‌ల్ ఫ్యాక్ట‌రీ అంటూ ర‌క‌ర‌కాల అంశాల‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు. ఏవి ఎంగేజింగ్‌గా అనిపించ‌వు. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ వావ్ అనిపించేలా లేదు. గ‌తంలో చాలా సినిమాల్లో చూసిందే. న‌మ్మ‌కం ప్రాణాలు తీసేలా ఉండ‌కూడ‌దంటూ ఓ చిన్న మెసేజ్ ఇచ్చి ఎండ్ చేశారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన నష్టం జ‌రిగిపోయింది.

Bhogi Movie Review & Rating

ఫోక‌స్ పాయింట్‌: “భోగి” ఎమోష‌న్స్ నిల్‌…యాక్ష‌న్ ఫుల్ – ఆడియెన్స్‌ను మెప్పించ‌డం క‌ష్ట‌మే.

రేటింగ్: 2/5

[Click Here To Read in ENGLISH]

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Bhogi Movie
  • #Dimple Hayathi
  • #sampath nandi
  • #sharwanand

Reviews

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago

latest news

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

45 mins ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

3 days ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

3 days ago
శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

3 days ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version